చికెన్‌.. ధర మండెన్‌.. షేర్‌ మార్కెట్‌ను తలపిస్తున్న ధరలు 

19 Sep, 2022 18:36 IST|Sakshi

సాక్షి, నంద్యాల: చికెన్‌ ధర అమాంతం పెరుగుతూ, పడిపోతూ షేర్‌ మార్కెట్‌ను తలపిస్తోంది. వ్యాపారులు రోజుకొక ధర నిర్ణయిస్తూ తమ వ్యాపారాన్ని మూడు కోళ్లు.. ఆరు కిలోలుగా సాగిస్తున్నారు. ఆదివారం వస్తే ధర కొండెక్కుతుంది. గత ఆదివారం రూ. 200 ప్రకారం విక్రయించగా ఈ ఆదివారం మాత్రం రూ. 220గా నిర్ణయించారు.

ఇక మిగిలిన రోజుల్లో రూ.180 పైనే ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. ఆదివారం విక్రయాలు అధికంగా ఉంటాయని, దీంతో కోళ్లు దొరకకపోతుండటంతో అధిక ధరలు వెచ్చించి తెస్తుండటం వల్లే ధర పెంచుతున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండంగా నాటు కోడి మాసం  కేజీ రూ.500 పైనే పలుకుతుంది.  

చదవండి: (సార్‌ ఇటువైపు చూడండి.. అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన కొలగట్ల)

మరిన్ని వార్తలు