సీఎం జగన్‌ను కలిసిన త్రిదండి చినజీయర్‌ స్వామి

20 Nov, 2021 10:19 IST|Sakshi

సాక్షి, అమరావతి: సాక్షి, అమరావతి: రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని త్రిదండి చినజీయర్‌ స్వామి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి నివాసంలో శనివారం స్వామీజీ.. వైఎస్‌ జగన్‌ను కలిశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఇందులో భాగంగా 1035 కుండ శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ట, కుంభాభిషేకం, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ సందర్భంగా సీఎం.. స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు ఉన్నారు. 

చదవండి: చిన్నారి ప్రాణం నిలిపిన ఆరోగ్యశ్రీ

మరిన్ని వార్తలు