అనంత కలెక్టర్‌కు సీఎం జగన్‌ అభినందనలు

26 Feb, 2021 00:27 IST|Sakshi

సాక్షి, అమరావతి / అనంతపురం అర్బన్‌: ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ జాతీయ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్‌ గంధం చంద్రుడును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పనితీరుపై సీఎం ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చే దిశగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్‌ పూనం మాలకొండయ్య, జేడీఏ రామకృష్ణ పాల్గొన్నారు. 

చదవండి: (పీఎం కిసాన్‌ అవార్డు అందుకున్న ‘అనంత’ కలెక్టర్‌)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు