బెండపూడి విద్యార్థుల ప్రతిభకు సీఎం జగన్‌ ఫిదా.. కలవాల్సిందిగా..

19 May, 2022 04:20 IST|Sakshi
ఏప్రిల్‌ 24న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం

విద్యార్థులతో సహా తనను కలవాల్సిందిగా పాఠశాల హెచ్‌ఎం, ఇంగ్లిష్‌ ఉపాధ్యాయుడికి ఆహ్వానం

తొండంగి: కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జెడ్పీ హైస్కూలు విద్యార్థులు విదేశీ శైలిలో అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడి అబ్బురపరచిన వైనం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. ‘ఇంగ్లిష్‌పై బెండపూడి జెండా’ శీర్షికతో ఇటీవల ‘సాక్షి’లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం స్పందించారు.

తనను కలవాల్సిందిగా సీఎం నుంచి తమకు సమాచారం అందిందని బెండపూడి జెడ్పీ హైస్కూలు హెడ్‌మాస్టర్‌ జి.రామకృష్ణారావు, ఇంగ్లిష్‌ ఉపాధ్యాయుడు జి.వి.ప్రసాద్‌ తెలిపారు. గురువారం విద్యార్థులను తోడ్కొని వెళ్లి సీఎంను కలవనున్నట్టు వారు వివరించారు. 

మరిన్ని వార్తలు