తొలి విడత బస్సు యాత్ర విజయవంతం: వైవీ సుబ్బారెడ్డి

15 Nov, 2023 11:09 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: తొలి విడత సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైందని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 175 నియోజకవర్గాల్లో ఈ నెల 30 వరకు రెండో విడత బస్సు యాత్ర జరగనుందన్నారు. ఇవాళ నరసన్నపేట నుంచి రెండో విడత యాత్ర మొదలవుతుందన్నారు.

నాలుగున్నరేళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 70 శాతం పథకాలు బీసీ,ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు ఈ ప్రభుత్వం అందించిందన్నారు.

‘‘సామాజిక సాధికార యాత్రలో నాడు-నేడు పనులను పరిశీలిస్తున్నాం. ఎక్కడైనా లోపాలుంటే సరి చేయాలని చెబుతున్నాం. జనసేన నాయకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు. నాడు-నేడుపై బురద జల్లే పనిలో జనసేనలో ఉంది. ఎన్ని పార్టీలు కలిసినా రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయం’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
చదవండి: టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్ల స్కిల్‌ స్కామ్‌ నిధులు

మరిన్ని వార్తలు