మీరే మాకు కళ్లు, చెవులు.. మీరే మా బలం: సీఎం జగన్‌

27 Jul, 2021 19:15 IST|Sakshi

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్  వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్‌ చేసుకోవాలని, వీటి సమర్థత మెరుగుపడాలంటే తనిఖీలు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై ఆయన మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లు తనిఖీలు చేయాలన్నారు

సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..
వారానికి రెండు సార్లు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు 4 సార్లు, మున్సిపల్‌కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్‌ కలెక్టర్లు వారానికి 4 సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించమని చెప్పాం
733 ఇనస్పెక్షన్లు మాత్రమే జరిగాయి
66.75శాతం మాత్రమే ఇనస్పెక్షన్లు చేశారు
కలెక్టర్లు 106శాతం, జేసీలు ( గ్రామ సచివాలయాలు) 107 శాతం ఇనస్పెక్షన్లు చేశారు
వీరంతా బాగానే ఇనస్పెక్షన్లు చేశారు
కాని మిగిలిన వారు సరిగ్గా చేయలేదు
జేసీ రెవిన్యూ 78శాతం, జేసీ హౌసింగ్‌49శాతం, జేసీ ( ఏ అండ్‌ డబ్ల్యూ) 85శాతం, కార్పొరేషన్లలో మున్సిపల్‌కమిషనర్లు 89శాతం, ఐటీడీఏ పీఓలు 18శాతం, సబ్‌కలెక్టర్లు 21శాతమే ఇనస్పెక్షన్లు చేశారు
వీరి ఫెర్మానెన్స్‌ చాలా బ్యాడ్‌గా ఉంది
వీరికి మెమోలు జారీచేయమని ఆదేశాలు జారీచేశాను
వీరు ఇనస్పెక్షన్లు చేయకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ఎలా తెలుస్తాయి
సకాలంలో పెన్షన్లు వస్తున్నాయా? రేషన్‌కార్డులు వస్తున్నాయా? లేదా అని ఎవరికి తెలుస్తుంది
మనం వెళ్లపోతే ఎలా తెలుస్తాయి
తప్పులు జరిగాయని తెలిస్తే.. వాటిని రిపేరు చేసుకునే అవకాశం ఉంటుంది
అసలు వెళ్లకపోతే.. ఎలా తెలుస్తాయి
మొదట మనం మనుషులం.. ఆతర్వాతే అధికారులం
మానవత్వం చూపడం అనేదిమన ప్రాథమిక విధి
పేదల గురించి మొదట మనం ఆలోచించాలి
వచ్చే స్పందన నాటిని నిర్దేశించిన విధంగా నూటికి నూరుశాతం గ్రామ, వార్డు సచివాలయాలను పర్యవేక్షణ చేయాలి

డీబీటీ పథకాల్లో సోషల్‌ఆడిట్‌కోసం జాబితాను ప్రదర్శిస్తున్నారా? లేదా? చూడాలి
బియ్యంకార్డు, పెన్షన్‌ కార్డు, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలు అత్యంత ముఖ్యమైనవి
నిర్దేశించుకున్న సమయంలోగా అర్హులకు అవి అందాలి
ప్రతి అర్హుడికీ ఇవి అందాలి
మనకు ఓటు వేయని వారికి కూడా అందాలి
అనర్హులకు అందకూడదు
వీటిని స్వయంగా పరిశీలించాలి, పర్యవేక్షణ, సమీక్ష  చేయాలి
గ్రామ, వార్డు సచివాయాలను సందర్శించి వెరిఫికేషన్‌ ప్రాసస్‌ సరిగ్గా జరుగుతుందా? లేదా? చూడాలి
ఏమైనా లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి
వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది
మీరే మాకు కళ్లు, చెవులు, మీరే మా బలం
అందుకనే మీరు క్షేత్రస్థాయికి వెళ్లి.. పరిశీలనలు చేయాలి
పథకాలకు సంబంధించి పోస్టర్లు ఉంచుతున్నారా?లేదా? సంక్షేమ క్యాలెండర్‌ ఉంచారా లేదా? ముఖ్యమైన ఫోన్‌నంబర్లు ప్రదర్శిస్తున్నారా? లేదా? సోషల్‌ ఆడిట్‌ కోసం జాబితాలు ఉంచుతున్నారా? లేదా? సర్వీసులన్నీ... నిర్దేశిత సమయంలోగా అందిస్తున్నారా? లేదా?హార్డ్‌ వేర్‌ సరిగ్గా ఉందా? లేదా? ఇవన్నీ పరిశీలనలు చేయాలి
రిజిస్టర్లు, రికార్డులు సరిగ్గా చేస్తున్నారా? లేదా? చూడండి
బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ సరిగ్గా జరుగుతోందా?లేదా చూసుకోండి
వీటిని పట్టించుకోకపోతే గ్రామ, వార్డు సచివాలయాలు సమర్థవంతంగా పనిచేయవు
అధికారులు వస్తున్నారంటే... సేవలు సమర్థవంతంగా అదించడానికి ప్రయత్నిస్తారు
ఇంకా 2 శాతం గ్రామ, వార్డు సచివాలయాల్లో హాజరు గణనే ఉండడంలేదు
1.42 లక్షలమంది సిబ్బంది ఉంటే... 1.28 మంది హాజరు గణించడంలేదు
ఇక్కడ సరిదిద్దాల్సి ఉంది
ఇలా ఉంటే ఆశించిన ఫలితాలను అందుకోలేం
వచ్చే స్పందనలోగా మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు
మీకు మెమోలు ఇవ్వడం అన్నది నాకు చాలా బాధ కలిగించే విషయం
నా పనితీరుమీద నేను మెమో ఇచ్చుకున్నట్టే
వచ్చే స్పందన లోగా కచ్చితంగా అనుకున్న విధంగా అధికారులు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి

ఆగస్టు 10న నేతన్న నేస్తం
విద్యాకానుక ఆగస్టు 16న
రూ. 20వేల లోపు డిపాజిట్‌చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆగస్టు 24న డబ్బు ఇస్తాం
ఎంఎస్‌ఎంఈలకు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఆగస్టు 27న ఇన్సెంటివ్‌లు ఇస్తాం
ఈ మేరకు కలెక్టర్లు సన్నద్ధంగా ఉండాలి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు