14న సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరం సందర్శన

12 Dec, 2020 03:02 IST|Sakshi

క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన.. అనంతరం అక్కడే ఉన్నతస్థాయి సమీక్ష 

నిర్ధారిత సమయంలో పనులు పూర్తి చేయించడమే లక్ష్యంగా అడుగులు

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవధారైన పోలవరం ప్రాజెక్టు పనులను నిర్ధారించిన సమయంలోగా పూర్తి చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృఢసంకల్పంతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 14వ తేదీన పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. పోలవరం డ్యామ్‌ పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఎంత మేర పనులు జరుగుతున్నాయనే విషయాన్ని స్వయంగా పరిశీలించనున్నారు.

అనంతరం అక్కడ సమావేశ మందిరంలో పనులు పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ 14వ తేదీ ఉదయం 10.30 గంటలకు పోలవరం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.25 గంటలకు తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.   

మరిన్ని వార్తలు