వధూవరులకు సీఎం జగన్‌ ఆశీస్సులు

20 Oct, 2023 05:00 IST|Sakshi

సాక్షి, అమరావతి/కంకిపాడు: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వర­రావు­(నాని) మేన­కోడలు వివాహ వేడుకలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొ­న్నారు. కోనేరు లీలాప్రసాద్, రాజ్యలక్ష్మి విజయ చాముండేశ్వరిదేవి కుమార్తె డాక్టర్‌ స్నేహ, డాక్టర్‌ అనురాగ్‌ దీపక్‌ల వివాహం గురువారం కృష్ణా జిల్లా కంకిపాడులోని అయాన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం వైఎస్‌ జగన్‌ నూతన వధూవ­రులకు ఆశీస్సులు అందించారు. ఈ వేడుకలో మంత్రి జోగి రమేశ్, కలెక్టర్‌ పి.రాజాబాబు, ఎస్పీ జాషువా, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కైలే అనిల్‌కుమార్, దూలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు