కృష్ణా జిల్లాలో 33 కోవిడ్ ఆస్పత్రుల అనుమతులు రద్దు

6 Jun, 2021 21:03 IST|Sakshi

కృష్ణా: జిల్లాలో 33 కోవిడ్ ఆస్పత్రుల అనుమతి రద్దు చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌.. జిల్లా కోవిడ్‌ నోడల్‌ అధికారి శివశంకర్‌ ఆదివారం తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆస్పత్రుల అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా జిల్లాలో 82 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స నిమిత్తం ఆరోగ్యశ్రీ వర్తింపు చేస్తున్నాం. ఇప్పటివరకు జూన్ 3న 20, జూన్ 5న 13 ప్రైవేట్ ఆసుపత్రులు.. మొత్తంగా 33 కోవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేశామని తెలిపారు. 

మరిన్ని వార్తలు