రక్తహీనత నివారణకు బలవర్థక బియ్యం

13 Mar, 2021 04:57 IST|Sakshi

3 వేల టన్నుల కొనుగోలుకు టెండర్లు

సాక్షి, అమరావతి: రక్తహీనత లోపాన్ని నివారించేందుకు వీలుగా రాష్ట్రంలో ఎంపికచేసిన కొన్ని ప్రాంతాల్లో బలవర్థకమైన బియ్యాన్ని (ఫోర్టిఫైడ్‌ రైస్‌) పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా 3 వేల మెట్రిక్‌ టన్నుల ఫోర్టిఫైడ్‌ రైస్‌ను సేకరించేందుకు వీలుగా పౌరసరఫరాలసంస్థ టెండర్లను ఆహ్వానించింది. ఫుడ్‌ సేప్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)కు చెందిన ఫోర్టిఫికేషన్‌ రిసోర్స్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎఫ్‌ఆర్‌సీ) ప్రకారం బియ్యానికి బీ–12తో పాటు వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలను మిశ్రమం చేసే సొంత మిల్లు ఉన్నవారు మాత్రమే టెండర్లలో పాల్గొనాలని పౌరసరఫరాలసంస్థ అధికారులు స్పష్టం చేశారు.

ఇందులో భాగంగానే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు 750 మెట్రిక్‌ టన్నులు, తూర్పు గోదావరి జిల్లాకు 600, పశ్చిమ గోదావరి జిల్లాకు 850, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాలకు 500, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు 300 మెట్రిక్‌ టన్నుల ఫోర్టిఫైడ్‌ రైస్‌ను కేటాయించారు. టెండరు దక్కించుకున్నవారు ఆయా జిల్లాల్లో సూచించిన గోదాములకు బియ్యాన్ని సరఫరా చేయాలి. కొందరు పేదలు తీసుకుంటున్న ఆహారంలో ఇనుము, అయోడిన్, జింక్, విటమిన్‌ ఏ, డీ, బీ–12 లోపించినట్లు గుర్తించా రు. వీటిలోపం వల్ల వస్తున్న జబ్బుల నుంచి వారిని దూరం చేసేందుకు బలవర్థకమైన ఆహా రం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు