ఏపీకి తప్పనున్న వాయుగుండం ముప్పు!

13 Sep, 2021 03:49 IST|Sakshi

ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాల వైపు కదులుతున్న అల్పపీడనం

నేడు వాయుగుండంగా మారే అవకాశం

మహారాణిపేట (విశాఖ దక్షిణ): తూర్పు, మధ్య ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. రానున్న 12 గంటల్లో ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారి.. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాల్లో వాయువ్య బంగాళాఖాతం మీదుగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 2, 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ ప్రభావం ఏపీపై పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తరాంధ్రలో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 45–55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.   

మరిన్ని వార్తలు