వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర.. 13వ రోజు షెడ్యూల్‌

10 Nov, 2023 09:00 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. నేడు(శుక్రవారం) 13వ రోజు సామాజిక సాధికారిత బస్సుయాత్ర పార్వతీపురం, పెదకూరపాడు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో కొనసాగనుంది. 

ఉదయం గం. 10.30ని.లకు సీతానగరం మండలం లచ్చయ్యపేటలో వైఎస్సార్‌సీపీ నేతల విలేకర్ల సమావేశం ఉంటుంది. ఉదయం 11గంటలకు కాశయ్యపేట సచివాలయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీపురం పాత బస్టాండ్‌ వద్ద బహిరంగ సభ జరుగనుంది. ఈ సభలో పార్టీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ సహా పలువురు పార్టీ నేతలు పాల్గొననున్నారు. 

పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ధరణికోటలో వ్యాపార, ఉద్యోగ ప్రతినిధులతో పార్టీ నేతలు సమావేశం కానున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు విలేకర్ల సమావేశం, గం. 3.45ని.లకు ధరణికోట బేబీ గార్డెన్స్‌ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం గం. 4L45ని.లకు గ్రామ సచివాలయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు సందర్శించనున్నారు.  సాయంత్రం గం. 5:30 ని.లకు అమరావతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లోలో ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం గం. 12:15ని.లకు పెద్దతిప్పసముద్రం నుండి బైక్‌ ర్యాలీ, ఒంటి గంటకు కేజీఎన్‌ ఫంక్షన్‌ హాలులో వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం గం. 2:30 ని.లకు బైక్‌ ర్యాలీ ప్రారంభం అవుతుంది. మాదవయ్యగారి పల్లె, పులికల్లు మీదుగా బైక్‌ ర్యాలీ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ములకలచెరువులో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు