Chandrababu : జలీల్‌ఖాన్‌కు పెద్దన్న ఎవరో తెలిసిపోయింది

16 Aug, 2023 11:13 IST|Sakshi

జలీల్ ఖాన్ = బీకాంలో ఫిజిక్స్

చంద్రబాబు = బైపీసీతో ఇంజినీరింగ్

జలీల్‌ఖాన్‌.. పరిచయం అవసరం లేని పేరు. బీకాంలో ఫిజిక్స్‌తో అపారమైన ఖ్యాతి సంపాదించి అంతులేని ప్రాచుర్యాన్ని పొందిన నాయకుడు. నిజానికి పార్టీ ఫిరాయించిన దాని కంటే ఎక్కువ మైలేజీని తన మాటలతో మూటగట్టుకున్నారు. చరిత్రలో ఫిజిక్స్‌తో అత్యంత ఘనత సాధించిన అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కంటే తననే  ఎక్కువ గుర్తుంచుకునేలా చేశారు జలీల్‌ఖాన్‌. ఆయన నోటి నుంచి వచ్చిన అణిముత్యాలు ఇవిగో. 

ఇక చాన్నాళ్లకు జలీల్‌ఖాన్‌కు పెద్దన్నయ్య ఎవరో తెలిసిపోయింది. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు .. ఇప్పుడు జలీల్‌ఖాన్‌ కంటే ఓ ఆకు ఎక్కువ చదివానని నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు.. పార్టీ పూర్తిగా పతనమవుతున్నా.. లేని ఢాంబికాలకు పోతున్నాడని తెలుగుదేశం పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. తన మాటలకు అంతగా క్రెడిబిలిటీ లేకపోవడంతో.. కొత్తగా విజన్‌ అంటూ మరో పాట అందుకున్నారు. విజన్‌ 2020కి బదులు ఇప్పుడు విజన్‌ 2047 పేరిట ఓ ప్రకటన చేశారు. తాజాగా విశాఖలో ‘విజన్-2047’ను ప్రకటించిన చంద్రబాబు.. అదే సభలో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చదవాలంటూ మతిలేని మాటలు చెప్పారు. 

ప్రపంచంలో అన్నీ తనకే తెలుసని, కంప్యూటర్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌ వరకు తానే కనిపెట్టానని, ఐటీకి తాత అని చెప్పుకునే చంద్రబాబు గురించి ఇన్నాళ్లు ఎల్లో మీడియాలో వీపరీతంగా కలరింగ్‌ ఇచ్చారు. సత్య నాదెళ్లకు ట్రైనింగ్‌ ఇచ్చి అమెరికా పంపానని చెప్పుకున్నప్పుడు అవునా అనుకున్నారు కానీ.. చంద్రబాబు చాణక్యం అంతా ఒట్టి డొల్ల అని తెలిసిపోయి ఇప్పుడు నవ్వుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు