ప్రేమ వివాహం చేసుకున్నాం.. రక్షణ కల్పించండి

4 Jun, 2022 20:59 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

కాకినాడ సిటీ: కుటుంబ పెద్దల నుంచి రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబును కోరింది. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వీరు ఎస్పీని కలసి తాము ప్రేమ వివాహం చేసుకున్నామని, పెద్దలు తమ వివాహాన్ని నిరాకరిస్తున్నారని, వీరి వల్ల ప్రాణభయం ఉందంటూ ఫిర్యాదు చేశారు.

పిఠాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఆళ్ల శశాంకలక్ష్మి, కాశీవారిపాకలకు చెందిన వాసంశెట్టి శివమణికంఠ ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబ పెద్దలు నిరాకరించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లి పోయి రామచంద్రపురంలోని ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.

శశాంకలక్ష్మి విలేకర్లతో మాట్లాడుతూ తమ గురించి ఇంట్లోవారికి చెప్పినా ఒప్పుకోకుండా మరో వివాహం చేసేందుకు ప్రయత్నించడంతో ఇంట్లోంచి బయటకు వచ్చి ఇద్దరం కలిసి వారం రోజుల క్రితం ఊరు నుంచి వెళ్లి పోయినట్లు తెలిపారు. తమ సామాజిక వర్గాలు వేర్వేరు కావడంతో తమ కుటుంబం ఈ పెళ్లికి అంగీకరించదని, తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరినట్లు తెలిపింది. ఈ పెళ్లి ఇద్దరి ఇష్ట్రపకారమే జరిగిందని దీనిలో ఎవరి ప్రమేయం లేదని తెలిపింది.

చదవండి: (తిరుపతి–పీలేరు రహదారికి మహర్దశ.. వెయ్యి కోట్లతో..)

మరిన్ని వార్తలు