ఆదర్శమంటే ఆయనే: సర్కారు కాలేజీలో పీవో కుమారుడు

3 Sep, 2021 08:32 IST|Sakshi
ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు అందజేస్తున్న పీవో

ప్రభుత్వ కళాశాలలో చేరిన పీవో కుమారుడు

సీతానగరం (పార్వతీపురం): ఒకరికి ఏదైనా సలహా ఇచ్చేముందు మనమూ దాన్ని ఆచరించేందుకు సిద్ధంగా ఉండాలనే మాటను అక్షరాల పాటిస్తున్నారు పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌. తన పిల్లలను ప్రభుత్వ బడి, కళాశాలలో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇటీవల పార్వతీపురం కేపీఎం మున్సిపల్‌ హైస్కూల్‌లో పదోతరగతి పూర్తిచేసిన కుమారుడు త్రివిక్రమ్‌ను గురువారం సీతానగరం మండలం జోగంపేటలో ఉన్న గిరిజన ప్రతిభ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరంలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం నాడు–నేడు నిధులతో సుందరంగా తీర్చిదిద్దిందని, ప్రమాణాలతో కూడిన విద్యను బోధిస్తున్నారని, అందుకే గిరిజన కళాశాలలో తన కుమారుడిని చేర్పించానని ఆయన విలేకరులకు తెలిపారు. అనంతరం అక్కడి విద్యార్థులకు బ్యాగ్‌లు, మెటీరియల్, నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు.

ఇవీ చదవండి:
అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. 
ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా?

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు