వినాయకుడికి పట్టు వస్త్రాలు

12 Sep, 2021 03:44 IST|Sakshi
పట్టువస్త్రాలను తీసుకొస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు

సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి

కాణిపాకం (యాదమరి) (చిత్తూరు జిల్లా): కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామికి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఏడాది మంత్రి పెద్దిరెడ్డి, ఆయనతో పాటు ఎంపీ రెడ్డెప్ప, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు ఎంఎస్‌ బాబు, జంగాలపల్లె శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలసి ఊరేగింపుగా పట్టువస్త్రాలు తీసుకెళ్లారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం అలంకార మండపంలో వేదపండితులచే ఆశీర్వాదాలు చేయించి, తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందించారు. అంతకుముందు ఆలయంలో కొత్త హుండీని మంత్రి ప్రారంభించారు.  

మరిన్ని వార్తలు