ఇంధన సామర్థ్యంలో ఏపీ అగ్రగామి

31 Mar, 2023 02:43 IST|Sakshi

 బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ సెక్రటరీ ఆర్‌.కె. రాయ్‌

ఏపీ భవన్‌లో విద్యుత్‌ను ఆదా చేసే ఎలక్ట్రానిక్‌ పరికరాలు 

నెలలోనే  ప్రాజెక్టు పూర్తి చేసిన ఏపీఎస్‌ఈసీఎం

తొలి దశలో ఏటా రూ. 6.25 లక్షల విలువైన 49,469 యూనిట్ల ఆదా

సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్య రంగంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఏపీ ఒకటని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సెక్రటరీ ఆర్‌.కే. రాయ్‌ కొని­యా­డారు. ఇంధన భద్రత, పర్యావరణ లక్ష్యా­లను సాధించడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై ఇంధన తీవ్రతను తగ్గించడానికి సహాయ­పడే ఇంధన సామర్థ్య కార్యకలా­పాలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్య­త­ని­స్తోందని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఇంధన సామర్థ్య పరికరాలను అమర్చే ప్రాజెక్టును ఏపీ రాష్ట్ర ఇంధన పరి­రక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం)  రికార్డు స్థాయిలో నెల రోజు­ల్లోనే పూర్తిచేసింది.

ఈ ప్రాజెక్టును రాయ్‌ గురువారం ప్రారంభించారు.  ఆయ­న మాట్లాడుతూ.. ఏపీ భవ­న్‌­లో ఏటా 1.96 లక్షల యూనిట్ల విద్యుత్తును, రూ.39 లక్షల మేర ప్రజా ధ­నాన్ని ఆదా చేయొచ్చని చెప్పారు. 139 టన్నుల కార్బన్‌ ఉద్గారాలను త­గ్గించొచ్చ­న్నారు. ఇందుకోసం పెట్టిన పె­ట్టు­బడి 13 నెలల్లోనే ఇంధనం ఆదా రూపంలో తిరిగి పొందవచ్చన్నారు. తొలి దశలో హాలోజన్‌ ల్యాంప్‌ల స్థానంలో 190 వాట్ల కె­పా­సిటీ గల 12 ఎల్‌ఈడీ ఫ్లడ్‌ లైట్లు, సంప్రదాయ సీలింగ్‌ ఫ్యాన్ల స్థానంలో 28 వాట్స్‌ కెపాసిటీ గల 170 బీఎల్‌డీసీ సీలింగ్‌ ఫ్యా­న్లు, 1.8 టీఆర్‌ 3 స్టార్‌ రేటెడ్‌ హాట్‌ అండ్‌ కోల్డ్‌ ఇన్వర్టర్‌ టైప్‌ స్ప్లిట్‌ ఏసీలు, కారి­డార్‌ల వద్ద లైట్లను నియంత్రించడానికి 40 మోషన్‌ సెన్సార్లను ఏర్పాటు చేశారని తెలి­పారు.

దీని­వల్ల ఏటా రూ.6.25 లక్షల విలువైన49,469 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందన్నారు. నెల రోజుల్లోనే పనులు పూర్తి చేసి­న ఏపీ­ఎస్‌ఈ­సీఎం సీఈవో ఎ.చంద్రశేఖర­రెడ్డిని రాయ్‌ అభినందించారు. ఏపీ భవన్‌ ప్రిన్సి­పల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పాల్గొన్నారు. ఇంధన సామర్థ్య చర్యలకు న్యూ ఢిల్లీలో బీఈఈ ఎంపిక చేసిన తొలి రాష్ట్ర భవన్‌ ఏపీ భవన్‌. ఇక్కడి ఇంధన పొదుపు చర్యల ఫలితాల ఆధారంగా ఇతర రాష్ట్ర ప్ర­భుత్వాల భవనా­ల్లోనూ ఇదే ప్రాజె­క్టును అ­మలు చేయాలని బీఈఈ భావిస్తోంది. ఏపీ భవన్‌ను ఎంపిక చేసి ఏపీఎస్‌­ఈసీ­ఎం ద్వా­రా ఇంధన సామ­ర్థ్య చర్యలను విజ­యవంతం­గా అమ­లు చే­సిన  బీఈఈకి ఇంధన శా­ఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు