విధుల్లో చేరిన రాజమండ్రి జైలు సూపరిండెంట్‌ రాహుల్

29 Sep, 2023 10:37 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ రాహుల్‌ విధుల్లోకి చేరారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో సూపరిండెంట్ రాహుల్ విధులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జైలు సూపరిండెండెంట్ భార్య అనారోగ్య కారణాలతో  సెలవు పెడితే పచ్చ మీడియా విపరీతార్థాలు తీసింది. దీంతో పచ్చ మీడియా తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

కాగా, రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ భార్య ఎస్‌ రాహుల్‌ భార్య కిరణ్మయి(46) ఈ నెల 15న మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి ఆసుపత్రిలో చికిత్స  పొందుతూ కన్నుమూశారు. మృతదేహాన్ని అంబులెన్సులో గుంటూరు తీసుకెళ్లారు.

భార్య అనారోగ్యం కారణంతో జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ సెలవులపై వెళ్లారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నేపథ్యంలో ఒత్తిడిపై రాహుల్‌ సెలవులపై వెళ్లారని పలువురు దుష్ప్రచారం చేశారు.

ఈ క్రమంలో ఎస్పీ జగదీష్‌ స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశారు. భార్య అనారోగ్యం కారణంగానే ఆయన సెలవుపై వెళ్లారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన అవాస్తవ కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఒత్తిళ్లు లేవని,  తమ డ్యూటీ తాము చేస్తున్నానమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు