చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి

1 Jan, 2023 21:06 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ఇటీవల నెల్లూరు జిల్లాలోని కందుకూరు ఘటన విషాదం మరువక ముందే మరో దారణం జరిగింది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా ముగ్గురు మహిళలు మృతిచెందగా పలువురు మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 

చంద్రన్న కానుకులు ఇస్తామంటూ టీడీపీ నేతల ప్రచారం కారణంగా సభకు పెద్ద ఎత్తున మహిళలను, వృద్ధులను టీడీపీ నేతలు తరలించారు. ఈ క్రమంలో కొందరికి మాత్రమే కానుకలు ఇచ్చి మిగతా వారిని అక్కడి నుంచి వెళ్లిపోమన్నారు టీడీపీ నేతలు. దీంతో, తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు దూసుకొచ్చారు. జనం ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక మహిళ ఘటనా స్థలంలో మృతి చెందగా.  మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతిచెందారు. మరో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.  

ఈ క్రమంలో సభ నిర్వాహకులు, చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, నాలుగు రోజుల క్రితమే జరిగిన కందుకూరులో చంద్రబాబు రోడ్‌ షో  కారణంగా ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే న్యూ ఇయర్‌లో మొదటిరోజే ఇలా మరో దారుణం జరిగింది. దీంతో, చంద్రబాబు తీరుపై ప్రజలు మండిపడితున్నారు.  

గుంటూరు చంద్రబాబు సభకు 5వేల లోపే జనం హాజరు కాగా, హాజరైన వారిలో సగం మందికి కూడా కానుకలు అందలేదు. కానుకలు అయిపోయాయంటూ నిర్వహకులు చేతులెత్తేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దాంతో ఒక మహిళల అక్కడికక్కడే మృతి చెందగా,  తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు.

కానుకల దృశ్యాలను డ్రోన్‌ కెమెరాలతో షూట్‌ చేసే యత్నం చేశారు. జనాలు ఎక్కువగా కనిపించేందుకు అందరినీ ఒకేవైఉపు తరలించే ప్రయత్నం చేశారు.కానుకల కోసం ఒక్కసారిగా జనాలు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.

మరిన్ని వార్తలు