నెల్లూరులో ఆకాశవాణి కేంద్రం

28 Apr, 2022 05:08 IST|Sakshi
ఆకాశవాణి కే ంద్రం ప్రారంభోత్సవంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి కాకాణి, ఎమ్మెల్యే కోటంరెడ్డి

జాతికి అంకితం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మీడియా అద్దం లాంటిదని, అది సమాజాన్ని ప్రతిబింబించడంతో పాటు సమాజంలో సానుకూల మార్పునకు కృషి చేయాలని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. అనంతరం 100 మీటర్ల 10 కిలోవాట్ల ఎఫ్‌ఎం స్టేషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడు తూ.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి హో దాలో నెల్లూరు ఎఫ్‌ఎంకు శంకుస్థాపన చేశామని, అది పూర్తి స్థాయి రేడియో కేంద్రంగా రూపుదిద్దుకో వడం, ఇప్పుడు దాన్ని జాతికి అంకితం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ప్రజల జీవితాల్లో రేడియో పాత్రను ప్రస్తావిస్తూ మీడియాకు పలు సూచనలు చేశారు. ప్రచార, ప్రసార మాధ్యమాలు అందించే వార్తలు సంచలనాలకోసం కాకుండా సత్యానికి దగ్గరగా ఉండాలన్నారు. చానళ్లలోని చర్చల్లో సభ్యత, సంస్కారంతో గౌరవప్రదమైన పదాలు వాడాలన్నారు. ఇప్పటికీ 60 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారని వారికి అనువుగా ఉండేలా సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, వ్యవసాయం వంటి వాటిని ప్రోత్సహించేందుకు పత్రికలు, మీడియా మాధ్యమాలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ప్రసార భారతి సీఈవో శశిశేఖర్‌ వెంపటి, ఆకాశవాణి డైరెక్టర్‌ జనరల్‌ ఎన్‌. వేణుధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఊరికో సేవాలయం ఉండాలి 
ప్రతి ఊరిలో ఒక విద్యాలయం, ఒక గ్రంథాలయం, ఒక దేవాలయం లాగా ఒక సేవాలయం కూడా ఉం డాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరు కాలువ వద్ద ఏర్పాటు చేసిన దేవిరెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ను ఆయన ప్రారంభించారు. దేవిరెడ్డి శారదమ్మ విగ్రహం వద  నివాళులర్పించారు.  

మరిన్ని వార్తలు