Akkineni Nageswara Rao: అక్కినేని శతజయంతి వేడుకలు.. కాంస్య విగ్రహం ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు

20 Sep, 2023 10:45 IST|Sakshi

తెలుగు సినిమా దిగ్గజం, అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. కృష్ణాజిల్లాలో పుట్టి సినీ ప్రపంచంలోనే తనకంటూ ఓ సామ్రాజ్యం ఏర్పరచుకున్న ఏకైక నటుడు మన అక్కినేని.  కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబరు 20 న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు.

దాదాపు 250కి పైగా చిత్రాల్లో కళామతల్లి ఒడిలో ఒదిగిపోయారు. ఆయన శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏఎన్నార్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

(ఇది చదవండి: భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజం: మెగాస్టార్)

అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ తారలు, ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అక్కినేని నాగార్జున కుటుంబసభ్యులు, సుమంత్, నాగచైతన్య, అమల, అఖిల్ ఆయనకు నివాళులర్పించారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్‌, శ్రీకాంత్‌, జగపతిబాబు, రానా, మంచు విష్ణు, నాని, దిల్‌ రాజు, మోహన్ బాబు, రామ్ చరణ్, మహేశ్ బాబు, సుమ కనకాల, టాలీవుడ్ సినీ పెద్దలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు