శ్రీమంతుడు సినిమాలోలా.. రైలు వదిలి సైకిలెక్కి!

8 Dec, 2021 08:35 IST|Sakshi

తాటిచెట్లపాలెం రైల్వే కాలనీలో సైకిల్‌పై వెళ్లి సమస్యలు తెలుసుకున్న డీఆర్‌ఎం 

తాటిచెట్లపాలెం: ఆయన వాల్తేరు డివిజన్‌ డీఆర్‌ఎం. శ్రీమంతుడు సినిమాలో మహేష్‌ బాబు గ్రామంలో పర్యటించినట్టు డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతి కూడా తాటిచెట్లపాలెం రైల్వే కాలనీలో పర్యటించారు. కాలనీ మొత్తం సైకిల్‌పైనే ప్రయాణించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకున్నారు. కాలనీ ప్రజలతో మాట్లాడారు.

సదుపాయాలు, వసతులు, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, పార్కుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. పారిశుధ్య, పరిశుభ్రత, సెక్యూరిటీ విషయంలో అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని సిబ్బందిని హెచ్చరించారు. ఆయన వెంట సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగ అధికారులు, పర్యావరణ, ఆరోగ్య విభాగ సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు