పండుగలా వైఎస్సార్, కృష్ణా జిల్లాల ప్లీనరీలు

3 Jul, 2022 05:32 IST|Sakshi
కృష్ణా జిల్లా ప్లీనరీలో వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మంత్రులు రోజా, జోగి రమేష్, ఎంపీ బాలశౌరి తదితరులు

పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వైఎస్సార్‌సీపీ నేతలు

కడప కార్పొరేషన్‌/సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్‌ జిల్లా, కృష్ణా జిల్లా ప్లీనరీలు శనివారం పండుగలా జరిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు, పార్టీ నేతలు తరలివచ్చారు. వైఎస్సార్‌ జిల్లా కడపలోని మునిసిపల్‌ మైదానంలో జరిగిన ప్లీనరీకి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, డాక్టర్‌ దాసరి సుధ, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, రమేష్‌ యాదవ్‌లు హాజరయ్యారు.

ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈనాడు, ఏబీఎన్‌ చానళ్లు, వారి పత్రికలను తాము వెలి వేశామని.. ఆ మీడియాకు చెందినవారు తమ సమావేశాలకు వచ్చి కవరేజ్‌ చేయాల్సిన అవసరం లేదని వారు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు తీర్మానం చేశారు. అలాగే మచిలీపట్నం సమీపంలోని సుమ కన్వెన్షన్‌ హాల్లో జరిగిన కృష్ణా జిల్లా ప్లీనరీకి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పేర్ని నాని అధ్యక్షత వహించారు.

వైఎస్సార్‌ జిల్లా  ప్లీనరీలో మాట్లాడుతున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి 

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి రోజా, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రీజనల్‌ కోఆర్డినేటర్‌ మర్రి రాజశేఖర్, జిల్లా ప్లీనరీ పరిశీలకుడు గౌతంరెడ్డి, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పార్థసారథి, అనిల్‌కుమార్, సింహాద్రి రమేష్, జెడ్పీ చైర్మన్‌ ఉప్పాల హారిక, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నియోజకవర్గ ప్లీనరీ పరిశీలకుడు వీరన్న తదితరులతో పాటు జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు చెప్పారు. చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియాపై వారు నిప్పులు చెరిగారు.  

మరిన్ని వార్తలు