‘అభినవ అంబేద్కర్‌, నిరంతర శ్రామికుడు సీఎం జగన్‌’

27 Oct, 2023 18:59 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతి నగరంలో వైఎస్సార్‌సీపీ బస్సు యాత్రలో భాగంగా బహిరంగ సభలో జరిగింది. ఈ సభలో వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతర శ్రామికుడిగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందరూ అండగా నిలవాలన్నారు. 

తిరుపతి సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. పెత్తందారులకు, పేదవారికి జరిగే యుద్ధంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉండాలని కోరుతున్నాను. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలగన్న సమాజాన్ని సీఎం జగన్ అందించారు. ఆయన ఆశయాలను నిరవేరుస్తూ అభినవ అంబేద్కర్‌లా ఉన్నారు. నిరంతర శ్రామికుడిలా ఉన్న సీఎం జగన్‌కి అండగా నిలవాలి. నేడు చరిత్రలో ఎవరూ తీసుకోని నిర్ణయాలను సీఎం వైఎస్ జగన్ తీసుకొన్నారు.

వినూత్న పథకాలు..
విద్య వ్యవస్థలో ఇంగ్లీష్‌ మీడియంను తీసుకువచ్చారు. సీఎం జగన్‌ నిర్ణయాలను పెత్తందారులు వక్రీకరిస్తున్నారు. టీడీపీ తోక పార్టీలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తూ దాడులు చేయిస్తున్నారు. 2024 ఎన్నికల యుద్ధంలో మరోసారి సీఎం జగన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల కోసం సీఎం జగన్‌ నేరుగా వేల కోట్లు రూపాయలు వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు. 8,288 మంది దళిత బిడ్డలు తిరుపతిలో ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు పొందుతున్నారు. దళితులకు  10 లక్షల గృహాలు మంజూరయ్యాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయంగా అభివృద్ధి చేస్తున్నాము. ఇవన్నీ సీఎం జగన్‌ చొరవతో జరుగుతున్నాయి. 

దమ్మున నాయకుడు సీఎం జగన్‌..
ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 2010లో తిరుపతికి వచ్చాను. భూమన కరుణాకర్ రెడ్డి మాకు శక్తిని ఇచ్చారు. అసెంబ్లీలో అచ్చమైన తెలుగులో మాట్లాడేది కరుణాకర్ రెడ్డి మాత్రమే. నేడు అభినయ్ రెడ్డి.. తండ్రిని మించిన తనయుడిగా మారిపోయాడు. 2024లో అభినయ్ రెడ్డి మంచి మెజారిటీతో గెలుస్తాడు. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక వారి వెనుక బీసీలు నడిచారు. కానీ, దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి వచ్చాక బీసీలు అందరు కాంగ్రెస్ వైపునకు వచ్చారు. 2019లో సీఎం జగన్‌ బీసీ సమావేశం అనంతరం బీసీలందరూ ముఖ్యమంత్రి జగన్ వెంట నడిచారు.

మేమంతా సీఎం జగన్‌ వెంటే..
పార్టీలో, పదవులలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు, నేడు నెరవేర్చారు సీఎం జగన్‌. ఐదు మంది డిప్యూటీ సీఎంలను చేసిన గణత సీఎం వైఎస్ జగన్‌దే. కార్పోరేషన్, మార్కెట్ కమిటీలలో 60 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. ఏ ముఖ్యమంత్రికి అయినా స్టేజ్ ఎక్కి నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా?. అలా, సీఎం జగన్‌ మాత్రమే చెబుతారు. ఆయన ఒక్కడికి మాత్రమే ఆ దమ్ము ఉంది. మా ధైర్యం సీఎం జగన్‌. 2024లో మరోసారి సింహంలా సింగిల్‌గా వస్తాడు.. 175/175 స్థానాల్లో విజయం సాధిస్తాడు. శ్రీకాకుళం, రాయలసీమ, కోస్తాలో సభలు మొదలైతే ఓ జాతరలా యాత్ర జరుగుతోంది. మరోవైపు టీడీపీ యాత్ర జనాలు లేక వెలవెలపోతోంది. మేమందరం సీఎం జగన్‌కు అండగా ఉంటాము. అభియనయ్ రెడ్డిని తిరుపతిలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. తిరుపతి సాక్షిగా సీఎం జగన్ భారీ మెజారిటీతో గెలుస్తారు.

175 స్థానాల్లో గెలుపు మనదే..
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. తిరుపతిలో 75 సంవత్సరంలో జరగని అభివృద్ధి నేడు చేసి చూపిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి, వారి తనయుడు అభినయ్ రెడ్డి. కాబోయే ఎమ్మెల్యే అభినయ్ రెడ్డికి అల్ ది బెస్ట్. యువతకు సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహం ఇస్తారు. నిజమైన బడుగు, బలహీన వర్గాలకి మేలుచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్ మాత్రమే. పేదవాడి తలరాత మారాలంటే 2024 ఎన్నికల్లో సీఎం జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు తప్పు చేసి జైలుకు వెళ్లాడు. కానీ దానికి పచ్చపత్రికలు వంత పడుతున్నాయి. నేడు తిరుపతిలో వైఎస్సార్‌సీపీ సభకు భారీగా జనాలు వచ్చారు. 175 స్థానాల్లో ఎవరు పోటీ చేసినా సీఎం జగన్‌ పోటీలో ఉన్నట్టు భావించి అన్ని స్థానాల్లో గెలిపించాలని కోరుతున్నాను. 

అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం..
తిరుపతి డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌ రెడ్డి మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు అణగారిన వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకునేవారు. కాన్నీ, సీఎం జగన్ అన్ని రంగాల్లో వారికి ప్రాధాన్యత ఇచ్చారు. అట్టడుగున ఉన్న వారిని క్రియాశీలక రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్. తిరుపతి కార్పొరేషన్‌లో  23 సీట్లు  46శాతం బీసీలకు ఇచ్చిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళలకు మేయర్ అవకాశం ఇచ్చింది మా పార్టీనే. రాష్ట్రంలో పెత్తందార్లకు చంద్రబాబు అండగా నిలుస్తుంటే సామాన్య పేద వర్గాల ప్రజల పక్షాన సీఎం జగన్ అండగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో 80 వేల ఓట్లు వేసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని గెలిపిస్తే, ఈరోజు 2 లక్షలు మందికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. తిరుపతి నగరంలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు అభివృద్ధి చేశాం. మరో 12 మాస్టర్ ప్లాన్ రోడ్లు రానున్న రెండేళ్లలో  అభివృద్ధి చేస్తున్నాం. వినాయక సాగర్ అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కింది. 

రాజకీయాలంటే వ్యాపారం కాదు..
ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లలో అంచెలంచెలుగా ఎదిగారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాలను సీఎం జగన్‌ నెరవేస్తున్నారు. పైరవీలతో వచ్చిన వ్యక్తి కాదు.. ఫైటర్‌గా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి సీఎం జగన్. రాజకీయాలంటే వ్యాపారం కాదు, నిచ్చెన కాదు, ప్రజలకు సేవ చేయాలనే తపన. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధితో 38 వేల ఎకరాలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్‌ది. 40 ఏళ్లలో ఎక్కడా లేని అభివృద్ధి తిరుపతిలో చేసి చూపించాం. తిరుపతి అభివృద్ధి కోసం మా పోరాటం, ప్రజలకు మేలు చేయడంలో ఎక్కడా రాజీపడేది లేదు. అర్హత ఉంటే నా బిడ్డ అభినయ్‌ను గెలిపించండి, కాదు అంటే ఓడించండి. 

మరిన్ని వార్తలు