ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది

22 Aug, 2020 09:55 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాభివృద్ధికి ఎదురవుతున్న అన్ని అడ్డంకులు ఈ వినాయక చవితితో తొలగి సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఆశాభావం వ్యక్తం చేశారు. వినాయక చవితి సందర్భంగా ఆశీల్మెట్టలోని సంపత్ వినాయక ఆలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువస్తున్న ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు ప్రతి పక్ష నేత చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును ప్రతిపక్ష నేత అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. (ఎంపీ మోపిదేవికి తృటిలో తప్పిన ప్రమాదం)

గణపతి ఆలయాలకు తగ్గిన రద్దీ
కోవిడ్ కారణంగా విశాఖ లోని గణపతి ఆలయాలకు రద్దీ తగ్గింది. ప్రతి ఏటా వినాయక చవితి రోజున భక్తుల రద్దీ ని తలపించే ప్రధాన దేవాలయం ఆశీల్ మెట్ట సంపత్ ఆలయనికి కూడా భక్తుల సంఖ్య తగ్గింది. ఎటువంటి ఆర్భాటం లేకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను నిర్ణీత సమయాల్లో మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. (వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే)

మరిన్ని వార్తలు