ఏడో రోజు వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర ఇలా..

4 Nov, 2023 07:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మేలు­ను వివరించడానికి వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈ యాత్ర ఏడో రోజు శనివారం సత్యసాయి జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాల్లో జరుగుతుంది.  

సత్యసాయి జిల్లా:
ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ధర్మవరం టౌన్ పోలీసు స్టేషన్ నుంచి ర్యాలీ జరపనున్నారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు అంజాద్ బాషా, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొనున్నారు.

గుంటూరు జిల్లా:
గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బస్సుయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2:45 గంటలకు సంగడిగుంట వైఎస్సార్‌ విగ్రహం నుంచి బీఆర్‌ స్టేడియం మీదుగా మాయాబజార్ వరకు యాత్ర కొనసాగనుంది. మాయాబజార్ మెయిన్ రోడుపై 3:30 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ,  నేతలు జంగా కృష్ణమూర్తి, వంగపండు ఉష, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, తదితరులు  హాజరుకానున్నారు.

విజయనగర జిల్లా:
ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శృంగవరపుకోటలో బస్సుయాత్ర ప్రారంభం కానుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మేరుగ నాగార్జున తదితరులు హాజరుకానున్నారు. ఉదయం 10:30 గంటలకు అలమండలో కళ్యాణ మండపం వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించనున్నారు. 11:20 కి జగనన్న కాలనీ, గ్రామ సచివాలయం సందర్శించనున్నారు. అనంతరం కొత్తవలస మీదుగా ఎస్.కోట వరకు బైకు ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 3:30 గంటలకు ఎస్.కోట దేవి జంక్షన్‌లో బహిరంగ సభ జరగనుంది.
చదవండి: సంపూర్ణ సాధికారత

మరిన్ని వార్తలు