‘ఏపీ ప్రజల ఆకాంక్షలు సీఎం జగన్‌ నెరవేర్చారు’

13 Dec, 2023 16:55 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: సీఎం జగన్‌ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నిలిపిన వైనాన్ని వివరిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగు­తోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సాగింది.

పాతపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో వైస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, వి.కళావతి, గొర్లె కిరణ్, కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ, చంద్రబాబుకు అధికారం ఇస్తే దుర్వినియోగం చేశారని, దోచుకున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రజల ఆకాంక్షలు తీర్చారు. వంశధార నిర్వాసితులకు 216 కోట్లు అదనపు పరిహారం ఇచ్చారు. హిర మండలం వద్ద 176 కోట్ల తో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం. పాడు పడిన పాఠశాలలు బాగు చేసి మంచి బడులు గా తీర్చి దిద్దారు. కొత్తూరు లో 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాం. గత ప్రభుత్వం కిడ్నీ రోగులకు నెఫ్రాలజిస్టులను కనీసం నియమించ లేకపోయింది. జగనన్న ఏకంగా కిడ్నీ రీసెర్చ్ స్టేషన్ నిర్మించారు’’ అని ఆమె పేర్కొన్నారు.

గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా చూడండి..
జన్మభూమి కమిటీల ద్వారా గత ప్రభుత్వం ప్రజల సొమ్ము దోపిడీ చేసిది. అవినీతి లేకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం  2లక్షల 45 వేల కోట్ల రూపాయిలు ప్రజల ఖాతా ల్లో జమ చేసింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడండి. సంక్షేమ పథకాలు గౌరవంగా ఇస్తున్న విషయం గమనించండి. చంద్ర బాబు అభివృద్ధి లేదంటున్నాడు. ప్రతి గ్రామంలో సచివాలయం, ఆరోగ్య కేంద్రం నిర్మించడం అభివృద్ధి కాదా?. ప్రజల అవసరాలు వైద్యం, విద్య, ఉపాధి కల్పించకుండా రోడ్డులు వేస్తే అభివృద్ధి జరిగినట్టా?. సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు అని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు ఎన్నికల ముందు అవే ఇస్తానంటున్నాడు. మూడు సార్లు చంద్రబాబుకి అధికారం ఇచ్చారు. ఏమి చేశారు?. వైస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో సంస్కరణలు తెచ్చింది. సచివాలయాలు ఏర్పాటు చేసింది. అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తే పేదలు కోటీశ్వర్లు అయ్యారు. పేదల జీవన ప్రమాణాలు పెంచే పనులు చేసింది ఈ ప్రభుత్వం
-మంత్రి ధర్మాన ప్రసాద రావు 

ప్రజల సొమ్మును చంద్రబాబు దోచుకున్నారు..
సీఎం జగన్ నాలుగున్నరేళ్లు పాలనలో ఎంతో మార్పు తెచ్చారు. సచివాలయాల ద్వారా అవినీతి లేకుండా పథకాలు ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో ఏమి చేశామో సచివాలయం వద్ద దాపరికం లేకుండా ధైర్యంగా బోర్డు పెట్టాం. ఈ బోర్డుల్లో ఎక్కడైనా అబద్ధం ఉంటే నిలదీయండి. ప్రజలకు డబ్బులు పంపిణీ చేయడం తప్పు అని చంద్రబాబు అంటున్నాడు. అప్పట్లో చంద్రబాబు అలీబాబా 40 దొంగల్లా దోచుకొని ప్రజల సొమ్ము తిన్నారు. పేద పిల్లాడికి మంచి యూనిఫార్మ్, స్కూల్ బ్యాగ్, బూట్లు కొని ఇస్తే తప్పా. తమ బిడ్డ నీట్‌గా తయారై స్కూల్‌కి వెళ్తుంటే తల్లి కళ్లల్లో సంతోషం చూడటం అభివృద్ధి కాదా?
-స్పీకర్‌ తమ్మినేని సీతారాం

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega