ఈ రాశివారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు

28 Jun, 2021 06:20 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి బ.చవితి సా.5.51 వరకు, తదుపరి పంచమి నక్షత్రం ధనిష్ఠ తె.4.52 వరకు (తెల్లవారితే మంగళవారం), వర్జ్యం ఉ.9.01 నుండి 10.34 వరకు, దుర్ముహూర్తం ప.12.28 నుండి 1.21 వరకు, తదుపరి ప.3.04 నుండి 3.56 వరకు అమృతఘడియలు... సా.6.29 నుంచి 8.07 వరకు.

సూర్యోదయం :    5.31
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు

రాశి ఫలాలు:
మేషం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తిలాభం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి.

వృషభం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొత్త సమస్యలు. మిత్రులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం: భూములు, వాహనాలు కొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి లాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో ఆటంకాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.

తుల: పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో  నిరుత్సాహం.

వృశ్చికం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు: మిత్రులను కలుసుకుంటారు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మకరం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆలయ దర్శనాలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. మిత్రులతో సఖ్యత. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని అవకాశాలు.

కుంభం: బంధువుల కలయిక. ముఖ్యమైన పనులు వాయిదా. చిత్రమైన సంఘటనలు. శ్రమాధిక్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మీనం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. పనుల్లో పురోగతి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో  సమస్యలు తీరతాయి.

మరిన్ని వార్తలు