వారంలో ఈ రాశివారికి ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది

10 Jan, 2021 06:19 IST|Sakshi

వారఫలాలు (10.01.21 నుంచి 16.01.21 వరకు)
మేషం..
అత్యవసరంగా చేపట్టిన కొన్ని పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. మీ నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు తీరి ఒడ్డునపడతారు. పారిశ్రామికవర్గాలకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం...
రుణవిముక్తి కోసం చేసే యత్నాలు కొంత సఫలమవుతాయి. క్రమేపీ అవసరాలకు తగినంత సొమ్ము సమకూరుతుంది. చేపట్టిన పనులు కష్టసాధ్యమైనా ఎవరి సహాయం లేకుండా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిలో శుభకార్యాలలో పాల్గొంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు వృద్ధిబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు శుభవార్తలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మిథునం...
పలుకుబడి కొంత పెరుగుతుంది. మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తుల కొనుగోలులలో అవాంతరాలు అధిగమిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాల విస్తరణలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. నేరేడు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం...
వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. బంధువుల నుంచి పిలుపు అందుతుంది. చాకచక్యంగా కొన్ని సమస్యలను అధిగమిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

సింహం....
కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తి లాభం కలిగే సూచనలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో అనుకోని విధంగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో సోదరులతో వివాదాలు. ధనవ్యయం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య...
కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగల సూచనలు. పారిశ్రామికవర్గాలకు అన్నింటా విజయమే. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

తుల...
ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి. చేపట్టిన పనులు కొంత నిదానిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. నిర్ణయాలు సకాలంలో తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భూవివాదాలు తీరతాయి. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు. వారం చివరిలో బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. గులాబీ, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం...
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తాయి.  పరిస్థితులు చక్కబడతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలకు ప్రణాళిక రూపొందిస్తారు. పరిచయాలు విస్తరిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల యత్నాలు ఫలించే సమయం. వారం చివరిలో బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

ధనుస్సు...
వ్యూహాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కష్టసాధ్యమైనా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం  ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఎరుపు, చాక్లెట్‌ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మకరం...
కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులకు అవకాశం. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రోత్సాహం. వారం చివరిలో ఆరోగ్య భంగం. ధనవ్యయం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

కుంభం...
ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. విద్యార్థులకు కృషి ఫలిస్తుంది. భూవివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వ్యాపారాలు కొంత మేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మీనం....
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. ఆరోగ్యం గతం కంటే కుదుటపడి ఊరట చెందుతారు. వ్యాపారాల విస్తరణ సాఫీగా సాగుతుంది. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు దక్కవచ్చు. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా