ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌!

15 Dec, 2022 13:18 IST|Sakshi

భారత్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ సేవలు (5G Services) ప్రారంభమయ్యాయి. అయితే ఈ సేవలు ఒకేసారి దేశవ్యాప్తంగా కాకుండా ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే లభ్యమవుతోంది. 5జీ సేవలు ఉపయోగించాలంటే ఆయా మొబైల్ కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో కొన్ని కంపెనీలు ఇప్పటికే అప్‌డేట్‌ ప్రక్రియను పూర్తి చేయగా.. తాజాగా యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ యూజర్లకు శుభవార్త చెప్పింది. దేశంలోని ఐఫోన్‌ యూజర్‌లకు 5జీ సపోర్ట్‌ అందించినట్లు యాపిల్‌ కంపెనీ తెలిపింది. 

5జీ సేవలు ప్రారంభం
జియో , ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్న ఐఫోన్‌ యూజర్లకు 5జీ అప్‌డేట్‌ సేవలు అందజేసినట్లు యాపిల్‌ స్పష్టం చేసింది. iOS 16.2 రిలీజ్‌ కావడంతో.. భారత్‌లోని వినియోగదారులు కవరేజీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్ స్పీడ్‌ను ఉపయోగించగలరు.

ఐఫోన్‌ 12 తర్వాత మార్కెట్‌లోకి వచ్చిన అన్ని అనుకూల మోడల్‌లలో 5G సేవలు సపోర్ట్ చేస్తాయి. మొదట ఐఫోన్‌లో సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి. అనంతరం జనరల్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆపై సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై ట్యాప్‌ చేయాలి. అక్కడ iOS 16.2ని డౌన్‌లోడ్ ఆప్షన్‌ కనిపిస్తుంది. నిబంధనలు అంగీకరించిన తర్వాత అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేయాలి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ iOS 16.2కి అప్‌డేట్ చేయడానికి ముందు మీ మొబైల్‌లో తగినంత బ్యాటరీ ఉందని నిర్ధారించుకోవడం ముఖ్యం.

చదవండి: పదేళ్లుగా నడుస్తోంది.. ఐఫోన్లకు సంబంధించి పెద్ద సీక్రెట్‌ బయటపెట్టిన యాపిల్‌ సీఈఓ!

మరిన్ని వార్తలు