గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ నైపుణ్యాలపై శిక్షణ

14 Dec, 2023 05:48 IST|Sakshi
ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ సీఎస్‌ఆర్‌ ప్రెసిడెంట్‌ కృషి ఇరానీ (ఎడమ), ఎన్‌ఎస్‌డీసీ సీఈవో వేద్‌మణి (కుడివైపున)

బజాజ్‌ ఫిన్‌సర్వ్, ఏఐసీటీఈ, ఎన్‌ఎస్‌డీసీ ఒప్పందం

హైదరాబాద్‌: ఏఐసీటీసీ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ) బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ చేతులు కలిపాయి. బుధవారం ఇవి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక సేవల రంగంలో ఉపాధి అవకాశాలు కోరుకునే అభ్యర్థులకు కావాల్సిన నైపుణ్యాలను అందచనున్నాయి. ఈ భాగస్వామ్యం కింద 20వేల మంది అభ్యర్థులకు సరి్టఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ బ్యాంకింగ్, ఫైనాన్స్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (సీపీబీఎఫ్‌ఐ) కోర్సులో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ శిక్షణ ఇవ్వనుంది.

పరిశ్రమకు చెందిన నిపుణులు, శిక్షణ భాగస్వాములు, విద్యా సంస్థల సహకారంతో ఈ ప్రోగ్రామ్‌ను బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ రూపొందించింది. టైర్‌–2, 3 పట్టణాల్లోని గ్రాడ్యుయేట్లు, ఎంబీఏ చేసిన వారు ఉద్యోగాన్వేషణ దిశగా కావాల్సిన నైపుణ్యాలను అందించనుంది. భావవ్యక్తీకరణ, పని నైపుణ్యాలను కూడా అందించనుంది. ప్రయోగాత్మకంగా ఒడిశాలోని పది జిల్లాల్లో మొదటి దశ కింద ఉద్యోగార్థులకు ఈ నైపుణ్యాలను ఆఫర్‌ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా పాల్గొన్నారు.  
 

>
మరిన్ని వార్తలు