రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్‌ వచ్చేది అప్పుడే.. ధర ఎంతంటే?

13 Dec, 2023 19:39 IST|Sakshi

భారత్‌ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో రెడ్‌ మీ ఫోన్‌లకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఇప్పటి వరకు విడుదలైన అన్నీ ఫోన్‌లు టెక్‌ ప్రియుల్ని ఎంతగానో అలరించాయి. ఈ తుణంలో షావోమీ రెడ్‌మీ నోట్‌ 13 5జీ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 

 షావోమీ రెడ్‌మీ నోట్‌ 13, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ప్లస్‌ ఫోన్‌లను సెప్టెంబర్‌లోనే చైనాలో లాంచ్‌ చేసింది. ఈ మూడు వేరియంట్‌ మోడళ్లు 6.67 అంగుళాలు 1.5కే ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఉన్నాయి. రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ప్లస్‌లో మీడియా టెక్‌ డైమన్సిటీ 7200 ఆల్ట్రా ఎస్‌ఓసీ, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో స్నాప్‌ డ్రాగన్‌ 7 జనరేషన్‌ 2 ఎస్‌ఓఎస్‌తో వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్‌లను భారత్‌లో జనవరి 4, 2024న విడుదల చేయనున్నట్లు షావోమీ ఇండియా అధికారికంగా ట్వీట్‌ చేసింది. 

షావోమీ రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్‌ ధరలు ఎంతంటే?
రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్‌ ఫోన్‌ ప్రారంభ ధర (చైనా కరెన్సీ యువాన్‌లో ) రూ.13,900, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ప్రారంభ ధర రూ.17,400, రెడ్‌మీ నోట్‌ 13ప్రో ప్లస్‌ ప్రారంభ ధర రూ.22,800 ఉండగా భారత్‌లో సైతం ఇవే ధరల్లో అందుబాటులో ఉంటాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక యూరప్‌లో రెడ్‌మీ నోట్‌ 13 ప్రో మోడల్ ధర రూ.40,700, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ప్లస్‌ రూ.45,000గా ఉంది. 

రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్ స్పెసిఫికేషన్స్ 
రెడ్‌మీ నోట్‌ 13 ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఎంఐయూఐ 14తో ఈ ఫోన్‌ రాబోతోంది. 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5కే హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేలను కలిగి ఉంది. ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్‌ 7 ఎస్‌ జెన్‌3 ఎస్‌ఓఎసీపై నడుస్తుంది. అయితే రెడ్‌మీ నోట్‌ 13 ప్రో ప్లస్‌ మీడియాటెక్‌ డైమన్సిటీ 7200 ఆల్ట్రా ఎస్‌ఓసీతో పనిచేస్తుంది. వెనిలా రెడ్‌మి నోట్ 13 మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్‌ఓసీని కలిగి ఉంది.

>
మరిన్ని వార్తలు