నిఘా జాబితాలో అనిల్‌ అంబానీ 

23 Jul, 2021 01:43 IST|Sakshi

ముంబై: నిఘా పెట్టిన ఫోన్ల జాబితాలో రిలయన్స్‌ అడాగ్‌ గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అంబానీ చెందిన నెంబర్లు ఉన్నట్లు ‘ది వైర్‌’ బయటపెట్టింది. 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. రాఫెల్‌ యుద్ధ విమానాలను తయారుచేసే సంస్థ డసాల్ట్‌కు భారత భాగస్వామిగా అనిల్‌ సంస్థను ఎంపిక చేయడం వెనుక ఆయను ఆయాచిత లబ్ది చేకూర్చే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు వచ్చాయి.

డసాల్ట్‌ ఏవియేషన్‌కు భారత ప్రతినిధి వెంకటరావు పోసిన, బోయింగ్‌ ఇండియా బాస్‌ ప్రత్యూష్‌ కుమార్‌ల నెంబర్లు నిఘా జాబితాలో ఉన్నాయని వైర్‌ తెలిపింది. దలైలామా సన్నిహిత సలహాదారులపై నిఘా కొనసాగిందని వైర్‌ వెల్లడించింది. సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మను 2018లో పదవిలోనుంచి తొలగించగానే ఆయన ఫోన్లపైనా నిఘా పెట్టారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు