ఏవో స్మిత్‌ విద్యుత్‌ ఆదా వాటర్‌ హీటర్‌

26 Dec, 2022 06:31 IST|Sakshi

ఎలిగెన్స్‌ ప్రైమ్‌ విడుదల  

బెంగళూరు: వాటర్‌ హీటింగ్‌ ఉత్పత్తుల్లో ప్రముఖ కంపెనీ అయిన ఏవో స్మిత్‌ ‘ఎలిగెన్స్‌ ప్రైమ్‌’ పేరుతో ఓ అధునాతన వాటర్‌ హీటర్‌ను విడుదల చేసింది. ఇది విద్యుత్‌ వినియోగాన్ని ఆదా చేసే ఫైవ్‌ స్టార్‌ రేటెడ్‌ ఉత్పత్తి అని కంపెనీ తెలిపింది.

ఇందులో రస్ట్‌ రెసిస్టెడ్‌ ఇంటెగ్రేటెడ్‌ డిఫ్యూజర్‌ టెక్నాలజీని వినియోగించినట్టు, విద్యుత్‌ను ఆదా చేయడంతోపాటు, నీటి వేడి కోల్పోకుండా చూస్తుందని పేర్కొంది. దీర్ఘకాలం పాటు మన్నుతుందని, కస్టమర్ల అవసరాలకు అనుకూలమైన ఉత్పత్తులను తీసుకురావాలన్న తమ విధానంలో భాగమే ఈ ఉత్పత్తి అని తెలిపింది. 15 లీటర్లు, 25 లీటర్ల సైజులో లభించే ఈ వాటర్‌ హీటర్‌ ధర రూ.11,400 నుంచి మొదలవుతుందని ఏవో స్మిత్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు