అమెరికా మార్కెట్‌ నుంచి సన్‌ ఫార్మా ఉత్పత్తుల రీకాల్‌

25 Apr, 2022 06:35 IST|Sakshi

న్యూఢిల్లీ: పలు కారణాలతో అమెరికా మార్కెట్‌ నుంచి సన్‌ ఫార్మా, అరబిందో ఫార్మా, జూబిలెంట్‌ సంస్థలు వివిధ ఉత్పత్తులను రీకాల్‌ చేస్తున్నట్లు అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ ఒక నివేదికలో పేర్కొంది. విటమిన్‌ బీ12 లోపం చికిత్సలో ఉపయోగించే సైనాకోబాలమిన్‌ ఇంజెక్షన్‌కు సంబంధించి 4.33 లక్షల వయాల్స్‌ను అరబిందో ఫార్మా రీకాల్‌ చేస్తోంది. ఏప్రిల్‌ 5న ఈ ప్రక్రియ ప్రారంభించింది. మరోవైపు, కళ్లలో సహజసిద్ధంగా నీటి ఉత్పత్తిని చేసేందుకు తోడ్పడే ’సెక్వా’ ఔషధాన్ని సన్‌ ఫార్మా వెనక్కి రప్పిస్తోంది. ఏప్రిల్‌ 1న ఈ ప్రక్రియ ప్రారంభించింది. అటు జూబిలెంట్‌ క్యాడిస్టా ఫార్మా .. మిథైల్‌ప్రెడ్నిసొలోన్‌ ట్యాబ్లెట్లకు సంబంధించి 19,222 బాటిల్స్‌ను రీకాల్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు