ఆజాద్‌ ఇంజినీరింగ్‌ @ రూ. 740 కోట్లు సమీకరణ లక్ష్యం

15 Dec, 2023 06:15 IST|Sakshi

ఇంజినీరింగ్‌ ప్రొడక్టుల కంపెనీ ఆజాద్‌ ఇంజినీరింగ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. లిస్టింగ్‌ కోసం ఈ హైదరాబాద్‌ కంపెనీ సెపె్టంబర్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 240 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 740 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది.

ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ కస్టమర్లలో జనరల్‌ ఎలక్ట్రిక్, హనీవెల్‌ ఇంటర్నేషనల్, మిత్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్, సీమెన్స్‌ ఎనర్జీ, ఈటన్‌ ఏరోస్పేస్‌ తదితర గ్లోబల్‌ దిగ్గజాలున్నాయి. కాగా.. ఇప్పటికే పార్క్‌ బ్రాండ్‌ హోటళ్ల కంపెనీ ఏపీజే సురేంద్ర పార్క్‌ హోటల్స్, హెల్త్‌టెక్‌ సంస్థ మెడీ అసిస్ట్‌ హెల్త్‌కేర్‌ సరీ్వసెస్, క్రయోజెనిక్‌ ట్యాంకుల తయారీ కంపెనీ ఐనాక్స్‌ ఇండియా, లగ్జరీ ఫరీ్నచర్‌ తయారీ కంపెనీ స్టాన్లీ లైఫ్‌స్టైల్స్‌ ఐపీవోలు చేపట్టేందుకు సెబీ నుంచి అనుమతులు పొందిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు