నిజాయితీగా శ్రమిస్తే సక్సెస్‌ గ్యారంటీ 

15 Dec, 2023 04:11 IST|Sakshi
చంద్రశేఖర్, సాహు గారపాటి, శివ నిర్వాణ, యుగంధర్, రాజేశ్, మేఘ, సుధీర్‌

దర్శకుడు శివ నిర్వాణ 

  ‘సత్యం’ రాజేశ్, మేఘా చౌదరి హీరో హీరోయిన్లుగా, ఎస్తేర్‌ ఓ కీలక పాత్ర చేసిన చిత్రం ‘టెనెంట్‌’. వై. యుగంధర్‌ దర్శకత్వంలో మోగుళ్ళ చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత సాహు గారపాటి, నటుడు ‘సుడిగాలి’ సుధీర్‌ అతిథులుగా హాజరై ‘టెనెంట్‌’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

‘‘సినీ పరిశ్రమను నమ్ముకుని నిజాయితీగా శ్రమిస్తే ఆలస్యమైనా సక్సెస్‌ తప్పకుండా వస్తుందనడానికి నిదర్శనం ‘సత్యం’ రాజేశ్, ‘సుడిగాలి’ సుధీర్‌. ఈ ఇద్దరూ కష్టపడి హీరోలుగా నిరూపించుకున్నారు. యుగంధర్‌ ప్రతిభ గల వ్యక్తి’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘ట్రైలర్‌ ఆసక్తిగా ఉంది. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సాహు గారపాటి.

‘‘సత్యం’ రాజేశ్‌గారు వరుస హిట్స్‌ సాధించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్‌. ‘‘ఈ సినిమా కథలోని ఎమోషన్స్‌కు ఆడియన్స్‌ కనెక్ట్‌ అవుతారు’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్‌.

>
మరిన్ని వార్తలు