ఆర్‌బీఐ ‘నిఘా నేత్రం’ నుంచి బయటపడ్డ సెంట్రల్‌ బ్యాంక్‌

21 Sep, 2022 11:43 IST|Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) దిద్దుబాటు చర్యల చట్రం (పీసీఏఎఫ్‌) నుంచి సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బయటపడింది. పలు ప్రమాణాలు మెరుగుపడటం, మూలధన నిర్వహణకు సంబంధించి నిబంధనలు పటిష్టంగా పాటిస్తామన్న లిఖితపూర్వక హామీ నేపథ్యంలో పీసీఏఎఫ్‌ జాబితా నుంచి బ్యాంకును తొలగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటన పేర్కొంది. 

చదవండి: పైలట్లకు భారీ షాకిచ్చిన స్పైస్‌ జెట్‌.. 3 నెలల పాటు

మరిన్ని వార్తలు