నీలాచల్‌ ఇస్పాత్‌ రేసులో ఎంఈఐఎల్‌

24 Dec, 2021 06:45 IST|Sakshi

ఫైనాన్షియల్‌ బిడ్లు దాఖలు చేసిన దిగ్గజ సంస్థలు

దీపమ్‌ కార్యదర్శి పాండే వెల్లడి

న్యూఢిల్లీ: పీఎస్‌యూ కంపెనీ నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఎన్‌ఐఎన్‌ఎల్‌) ప్రయివేటైజేషన్‌కు ఆసక్తిగల కంపెనీల నుంచి స్పందన లభించినట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. పీఎస్‌యూలో వ్యూహాత్మక వాటా కొనుగోలుకి ఫైనాన్షియల్‌ బిడ్స్‌ దాఖలైనట్లు వెల్లడించారు. దీంతో కంపెనీ డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ తుది దశకు చేరినట్లు తెలియజేశారు.

ఈ ఏడాది జనవరిలో ఎన్‌ఐఎన్‌ఎల్‌లో ప్రభుత్వ వాటా విక్రయానికి వీలుగా ప్రాథమిక బిడ్స్‌ను దాఖలు చేయవలసిందిగా కంపెనీలను దీపమ్‌ ఆహ్వానించింది. దరఖాస్తుకు మార్చి 29 తుది గడువుకాగా.. పలు కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) దరఖాస్తులు లభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా.. మెటల్‌ రంగ ప్రయివేట్‌ దిగ్గజాలు టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ సీŠట్‌ల్, జేఎస్‌పీఎల్‌సహా.. ఇన్‌ఫ్రా రంగ హైదరాబాద్‌ కంపెనీ మేఘా ఇంజినీరింగ్‌ (ఎంఈఐఎల్‌) సైతం తాజాగా ఫైనాన్షియల్‌ బిడ్స్‌ను వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు