కీలక నిర్ణయం.. వందల కోట్ల విలువైన మెటా షేర్లు అమ్మిన మార్క్ జూకర్‌ బర్గ్‌!

5 Dec, 2023 19:50 IST|Sakshi

సోషల్‌ మీడియా దిగ్గజం మెటాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ సంస్థ  అధినేత మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వందల కోట్లలో విలువైన కంపెనీ షేర్లను ఒకే రోజు రెండు సార్లు అమ్ముకున్నారని తెలుస్తోంది.  

పలు నివేదికల ప్రకారం.. దాదాపూ రెండేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత నవంబర్‌ నెల ముగిసే సమయానికి మెటా షేర్ల విలువ 172 శాతం పెరిగింది. అయితే అదే రోజు కంపెనీ షేర్లను అమ్ముకునేందుకు అనుమతి కోరుతూ జుకర్‌ బర్గ్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ కమిషన్‌ ఫారమ్‌ 4కు అప్లయ్‌ చేసుకున్నారు. 

అనంతరం తొలిసారి 560,180 షేర్లు, కొద్ది సేపటి తర్వాత అదనంగా 28,009 షేర్లను అమ్ముతూ 144 ఫారమ్‌ అప్లయ్‌ చేసుకున్నట్లు సెక్యూరిటీ ఎక్ఛేంజ్‌  ఫైలింగ్‌ తేలింది. ఆ మొత్తం షేర్ల విలువ రూ.1,600 కోట్లు. 

మార్క్ జూకర్‌ బర్గ్‌ సంస్థ షేర్లు అమ్ముకున్నారన్న నివేదికలతో యూఎస్‌ మార్కెట్లు ముగిసే సమయానికి మెటా షేర ధర 320.02 డాలర్ల వద్ద ముగిసింది. ఇక కంపెనీలో షేర్లు అమ్మగా సేకరించిన నిధుల్ని ఆయన ఎందుకు వినియోగిస్తారనే అంశంపై స్పష్టత లేదు. 

మెటా.. తీవ్ర వాద సంస్థ : రష్యా
ఈ అక్టోబరులో రష్యా అధికారిక వర్గాలు మెటాను ఓ తీవ్రవాద సంస్థగా పేర్కొనడం, తల్లిదండ్రుల అనుమతి లేకుండా 2019 నుంచి 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల సమాచారాన్ని తీసుకుందని ఆరోపిస్తూ 33 రాష్ట్రాలు పలు న్యాయ స్థానాల్ని ఆశ్రయించడం వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం మెటా షేర్లు ఈ ఏడాదిలో వరుసగా పాజిటీవ్‌గా ట్రేడయ్యాయి. దీంతో నవంబర్ 22న మెటా షేర్‌ విలువ గరిష్టా స్థాయికి 341.49 డాలర్లకు చేరుకోగా.. చివరి సారిగా అదే షేర్‌ విలువ డిసెంబరు 30, 2021 నుంచి తగ్గుతూ వస్తుంది.   

>
మరిన్ని వార్తలు