ఎయిరిండియా షాకింగ్‌ నిర్ణయం!

5 Dec, 2023 16:11 IST|Sakshi

టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా రెండు డేటా సెంటర్లను షట్‌డౌన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఎయిరిండియా ఏడాదికి వన్‌ మిలియన్‌ డాలర్లను ఆదా చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఎయిరిండియా తన కష్టమర్లకు సేవలంచేలా  అప్లికేషన్లు, ఇతర సర్వీసులు కోసం ముంబై, న్యూఢిల్లీలలో రెండు డేటా సెంటర్లను ఉపయోగిస్తుంది. అయితే, తాజాగా వాటిని షట్‌డౌన్‌ చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ నిర్ణయంతో వన్‌ బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేయొచ్చని ఎయిరిండియా చెబుతుంది. 

ఎయిరిండియా కార్యకలాపాలు కొనసాగించేందుకు క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగించనుంది. ఈ క్లౌడ్‌ సేవల్ని అమెరికాలోని సిలీకాన్‌ వ్యాలీతో పాటు పాటు భారత్‌లోని గురుగ్రామ్, కొచ్చి నిర్వహించనున్నారు. 

ఈ సందర్భంగా "మేం ఎయిరిండియా ప్రయాణంలో సాఫ్ట్‌వేర్-ఎ-సర్వీస్, ప్లాట్‌ఫారమ్-యాజ్-ఎ-సర్వీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-ఎ-సర్వీస్ మెథడాలజీ  సేవల్ని వినియోగిస్తున్నాం " అని ఎయిర్ ఇండియా చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ సత్య రామస్వామి చెప్పారు. గతేడాది జనవరిలో టాటా గ్రూప్ టేకోవర్ చేసిన ఎయిరిండియా రానున్న ఐదేళ్ల భవిష్యాత్‌ ఎలా ఉండాలనే అంశంపై ప్రణాళికల్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు రామస్వామి వెల్లడించారు.   

>
మరిన్ని వార్తలు