ఉద్యోగులకు బంపరాఫర్‌, జీతం ఎంత పెరగనుందంటే?

17 Mar, 2024 07:48 IST|Sakshi

ఆర్ధిక మాంద్యం భయాలు. ప్రాజెక్ట్‌ల కొరత, అవధుల్లేని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ వినియోగం,  వరుస లేఆఫ్స్‌, వేతనాల కోతల వంటి సంస్థలు వరుస నిర్ణయాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ గుడ్‌న్యూస్ చెప్పింది.

‘డెలాయిట్ ఇండియా టాలెంట్ ఔట్‌లుక్ 2024’ నివేదిక ప్రకారం..ఆయా కంపెనీల్లో పని చేస్తున్న కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లకు 9 శాతం శాలరీ పెరుగుతుందని అంచనా వేసింది. ఐటీ, బీపీఓలు మినహా అన్ని రంగాలలో కోవిడ్‌కు ముందు స్థాయిల కంటే మెరుగుగానే జీతాల పెంపు ఉంటుందని తెలిపింది. అయితే, ఈ అంచనా  2023లో వేసిన 9.2శాతం కంటే కొంచెం తక్కువగా ఉంది.

కంపెనీలు జూనియర్ మేనేజ్‌మెంట్‌కు గణనీయమైన ఇంక్రిమెంట్‌లను అందించే అవకాశం ఉండగా.. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వేతనాల చెల్లింపు ఉండనుంది.   

ఇంక్రిమెంట్లు
డెలాయిట్ ఇండియా శాలరీ నివేదిక ప్రకారం.. టాప్ పెర్ఫార్మర్లు సగటు రేటెడ్ ఉద్యోగులకు చెల్లించే ఇంక్రిమెంట్ల కంటే 1.8 రెట్లు ఎక్కువ పొందే అవకాశం ఉంది. 2023లో 0.6 రెట్లుతో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువ రేటింగ్ ఉన్న ఉద్యోగులు 0.4 రెట్లు పెరగనున్నారు.  

బోనస్‌లు
2024లో దాదాపు సగం కంపెనీలు తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలకు మించి అదనంగా బోనస్‌లు ఇవ్వనున్నట్లు డెలాయిట్‌ ఇండియా నివేదిక హైలెట్‌చేస్తోంది. ప్రతిభ గల ఉద్యోగుల్ని నిలుపుకునేందుకు సంస్థలు 7.5శాతంతో ప్రమోషన్‌ల పెంపును కొనసాగించాలని కూడా భావిస్తున్నట్లు వెల్లడించింది.  

పదోన్నతులు
నివేదిక ప్రకారం, పదోన్నతులు పొందగలరని అంచనా వేసిన ఉద్యోగుల శాతం 2023లో 12.3శాతం నుండి తగ్గింది.
 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers