Corporates On Chandrayaan 3 Success: చంద్రయాన్‌పై కార్పొరేట్ల హర్షం.. ఎవరేమన్నారంటే..

24 Aug, 2023 07:55 IST|Sakshi

చంద్రయాన్‌–3 విజయవంతం కావడంపై పలువురు కార్పొరేట్లు హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్‌ టీమ్‌ను ప్రశంసించారు.  

గర్వకారణం... 
ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం. భారత అంతరిక్ష, సాంకేతిక ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ప్రధాని నరేంద్ర మోదీకి, ఇస్రో బృందానికి శుభాభినందనలు. రాబోయే తరాలకు ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. 

– ఎన్‌ చంద్రశేఖరన్, టాటా సన్స్‌ చైర్మన్‌ 

సామర్థ్యానికి నిదర్శనం 
ఇస్రో, భారత సైంటిస్టులు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. అంతరిక్ష పరిశోధనలో భారతదేశ సామర్థ్యాలకు ఈ విజయం ఒక నిదర్శనం. ఈ అపూర్వ ఘట్టంలో భాగం కావడం మాకెంతో గర్వకారణం.

 
– ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్, ఎల్‌అండ్‌టీ సీఈవో

జాబిల్లి చేతికి అందింది 
మానవ జాతి ఆరంభం నుంచి చంద్రుడిని చూస్తూ కలలు కంటూనే ఉంది. చందమామ తన మాయా జాలంతో మనల్ని స్వాప్నికులుగా మార్చింది. నేడు ఆ మాయ, సైన్స్‌ కలిసి జాబిల్లిని మన చేతికి అందించాయి.

 
– ఆనంద్‌ మహీంద్రా, పారిశ్రామిక దిగ్గజం

చారిత్రక క్షణం 
ఇస్రో బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం. అంతరిక్ష పరిశోధనలను విజయవంతంగా అమలు చేయగలగడం దేశానికి తన సామర్థ్యాలపై గల నమ్మకానికి నిదర్శనం. ఇది 140 కోట్ల మంది భారతీయులకు చారిత్రక క్షణం. 

– గౌతమ్‌ అదానీ, అదానీ గ్రూప్‌ చైర్మన్‌

అద్భుత ఘట్టం 
భారత అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఇది మరో అద్భుత ఘట్టం.. మన అంతరిక్ష పరిశ్రమ సామర్థ్యాలకు నిదర్శనం.  మూడు దశాబ్దాలుగా భారతీయ స్పేస్‌ ప్రోగ్రామ్‌తో అనుబంధం కలిగి ఉండటం మాకు గర్వకారణం.

 
– పర్వత్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఎంటార్‌ టెక్నాలజీస్‌ ఎండీ 

ఇదీ చదవండి: చంద్రయాన్‌-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం

మరిన్ని వార్తలు