ఒక్క రోజులోనే రూ.57 వేల కోట్లు మటాష్‌.. అయినా ఆవిడే ప్రపంచంలో రిచెస్ట్‌!

10 Feb, 2024 19:29 IST|Sakshi

ఫ్రెంచ్ వ్యాపారవేత్త 'ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్' (Francoise Bettencourt Meyers) ఇటీవల 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన మహిళగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ జాబితాలో చేరింది. తాత స్థాపించిన బ్యూటీ ప్రొడక్ట్స్ సామ్రాజ్యంలో అరుదైన ఘనత సాధించిన ఈమె ఇటీవల ఒక్క రోజులోనే ఏకంగా 6.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూసింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.57267.9 కోట్లు నష్టపోయిందన్నమాట.

ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ ట్రాకర్ ప్రకారం, ఇప్పటి వరకు ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తం ఏ బిలినీయర్ కూడా నష్టాన్ని చూడలేదని స్పష్టం చేసింది. ఇంత మొత్తంలో నష్టాన్ని చవి చూయినప్పటికీ.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా కొనసాగుతోంది. క్షీణత తర్వాత ఆమె ప్రస్తుత నికర విలువ 80.5 బిలియన్ డాలర్లు.

2008 నుంచి ''ఎల్'ఓరియల్'' (L'Oreal) షేర్స్ ఎప్పుడూ తగ్గలేదని, నిన్న (శుక్రవారం) మాత్రమే కంపెనీ షేర్స్ ఏకంగా 7.5 శాతం తగ్గడం వల్ల వేలకోట్లు నష్టాన్ని చూడాల్సి వచ్చిందని సమాచారం.

కంపెనీ బోర్డు వైస్-ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బెటెన్‌కోర్ట్ మేయర్స్ L'Orealలో దాదాపు 35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. 2017లో మేయర్స్ తల్లి 'లిలియన్ బెటెన్‌కోర్ట్' మరణించిన తరువాత కుటుంబ వారసురాలిగా సంస్థలో అడుగుపెట్టింది. ఆ తరువాత తనదైన రీతిలో కంపెనీ పురోగతికి పాటుపడుతూ.. ఫ్రాన్స్‌లో అత్యంత ధనిక మహిళల జాబితాలో ఒకరుగా ఉన్నారు.

ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం - వేలాది ఉద్యోగులు ఇంటికి..

1909లో బెటెన్‌కోర్ట్ మేయర్స్ తాత 'యూజీన్ షుల్లెర్' (Eugene Schueller) ప్రారంభంలో హెయిర్ కలర్ ఉత్పత్తి చేసి విక్రయించడానికి సంస్థ స్థాపించారు. అదే నేడు మేయర్స్ సారథ్యంలో వేలకోట్ల కంపెనీగా అవతరించింది. బెటెన్‌కోర్ట్ మేయ‌ర్స్‌ను ప్రపంచంలో అత్యంత ధనిక మహిళగా నిలిచేలా చేసింది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega