ఈపీఎఫ్‌ పోర్టల్‌లో సమస్యలు.. వినియోగదారులకు చుక్కలు!

14 Jan, 2023 15:29 IST|Sakshi

ఎంప్లాయి ప్రావిడెంట్‌ ఫండ్‌(ఈపీఎఫ్‌) వెబ్‌ సైట్‌లో అంతరాయం ఏర్పడింది. గతేడాది 2021-2022 కాలానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేట్లు 8.1శాతానికి పెరిగాయి. అయితే పెంచిన ఆ వడ్డీ రేట్లు ఈపీఎఫ్‌ పోర్టల్‌లో మాయమయ్యాయి. 

గత కొద్ది రోజులుగా ఈపీఎఫ్‌ సబ్‌స్క్రైబర్లు పాస్‌బుక్‌ కనిపించడం లేదంటూ పెద్ద ఎత్తు ఫిర్యాదులు వెల్లు వెత్తాయి. అయినా పోర్టల్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు. జనవరి 14 సాయంత్రం 5గంటలకు అప్‌డేట్‌ అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ తరహా మెసేజ్‌లు గతకొన్ని రోజులుగా అలాగే చూపిస్తున్నట్లు యూజర్లు వాపోతున్నారు. 

ఇదే విషయంపై వినియోగదారులు ట్విటర్‌లో ఈపీఎఫ్‌వోకు ఫిర్యాదు చేస‍్తున్నారు. తమకు ఈపాస్ బుక్‌ కనిపించడం లేదంటూ స్క్రీన్‌ షాట్లను షేర్‌ చేస్తున్నారు. సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఫిర్యాదులపై ఈపీఎఫ్‌వో ఉన్నతాధికారులు స్పందించారు. సాంకేతిక లోపం వల్ల ఈ సమస్య తలెత్తిందని, యూజర్ల అసౌకర్యానికి  చింతిస్తున్నట్లు రిప్లయి ఇచ్చారు.

మరిన్ని వార్తలు