ఉద్యోగం నుంచి తొలగించింది.. మళ్లీ చేరొచ్చంటూ 4 సార్లు ఆఫర్‌ ఇచ్చిన అమెజాన్‌, రిజెక్ట్‌ చేసిన ఉద్యోగి!

3 Nov, 2023 16:22 IST|Sakshi

ప్రముఖ ఈ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ చరిత్రలోనే తొలిసారి ఈ ఏడాది ప్రారంభంలో 18,000 మందిని ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అ తర్వాత సైతం పలు రౌండ్లలో సిబ్బందిని ఇంటికి సాగనంపింది. అయితే, వారిలో కొంతమందిని  తిరిగి మళ్లీ విధుల్లోకి తీసుకుంది. అలా ఓ ఉద్యోగిని తొలగించిన అమెజాన్‌ తిరిగి తీసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరికి విఫలైమంది. అమెజాన్‌లో మళ్లీ చేరడాన్ని ససేమిరా అన్నాడు. ఇప్పుడు ఇదే అంశం దిగ్గజ టెక్‌ కంపెనీల్లో హాట్‌ టాపిగ్గా మారింది. 

ఆర్ధిక అనిశ్చితి, సంస్థ పునర్నిర్మాణం, కాస్ట్‌ కటింగ్‌, పలు జాతీయ అంతర్జాతీయ సమస్యల కారణంగా అనేక చిన్న చిన్న స్టార్టప్‌ల నుంచి దిగ్గజ టెక్‌ కంపెనీలతో పాటు ఈకామర్స్‌ సేలవందించే అమెజాన్‌ సైతం వర్క్‌ ఫోర్స్‌ని తగ్గించుకోక తప్పలేదు. మెల్లిమెల్లిగా పరిస్థితులు చక్కబడుతుండడం, మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగిపోవడం, కొత్త ప్రాజెక్ట్‌లు క్యూ కట్టడంతో పలు కంపెనీలు తొలగించిన ఉద్యోగుల్ని మళ్లీ తిరిగి విధుల్లోకి (Re Hiring) తీసుకుంటున్నాయి.

సాధారణంగా ‘మీ సేవలు చాలు ఇక వెళ్లిపోండి’ అంటూ తొలగించి.. మళ్లీ రీజాయిన్‌ చేయించుకుంటామని రెడ్‌ కార్పెట్‌ పరిస్తే.. ఆర్ధిక అనిశ్చితితో ఎవరైనా సరే సంస్థ ఇచ్చిన ఆఫర్‌ వైపు మొగ్గు చూపుతారు. కానీ, బిజినెస్‌ అనలిస్ట్‌గా పనిచేసిన ఈ మాజీ అమెజాన్‌ ఉద్యోగి అలా కాదు.

నీ సంస్థ వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ 
జనవరిలో కంపెనీ తనకి పింక్‌ స్లిప్‌ ఇచ్చింది. ఆ తర్వాత అతని స్కిల్స్‌ చూసి ముచ్చట పడి.. తిరిగి వెనక్కి తీసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. సదరు ఉద్యోగి మాత్రం ‘నీవ్వు వద్దూ.. నువ్విచ్చే జీతం వద్దంటూ’ నాలుగు సార్లు కంపెనీ ఇచ్చిన ఆఫర్‌ను రిజెక్ట్‌ చేశారు. ఎందుకని? ప్రశ్నిస్తే అమెజాన్‌లో పని చేసే సమయంలో తాను ఎలాంటి సంతృప్తి చెందలేదని సమాధానం ఇచ్చారు. అందుకు కారణాల్ని వివరించారు. 

మేనేజర్‌ మాటలు పచ్చి అబద్ధం 
ఈ ఏడాది జనవరిలో సదరు ఉద్యోగిని అమెజాన్‌ ఫైర్‌ చేసింది. అందుకు గానూ రెండు నెలల వేతనం ఇస్తామని మెయిల్‌ పంపింది. అంతవరకు బాగున్నా.. ఆ మెయిల్‌లో తన మేనేజర్‌..‘మీ పనితీరు అమోఘం. మిగిలిన సభ్యులతో పోలిస్తే మీలో ఉన్న స్కిల్స్‌ అద్భుతం.. ఉద్యోగ భద్రత గురించి మీరేం ఆలోచించొద్దు’ అంటూ కొన్ని హామీలు ఇవ్వడం షాక్‌ గురి చేసింది. ఎందుకంటే? అది నిజం కాదని తర్వాత తేలింది. సంస్థ (అమెజాన్‌) లేఆఫ్స్‌పై మేనేజర్ల అభిప్రాయాలు తీసుకోవడం లేదు కాబట్టి.

తొలగింపుకు రెండు నెలల ముందు 
తొలగింపులకు రెండు నెలల ముందు, ఉద్యోగులు తమ పని, ప్రాజెక్ట్‌లను డాక్యుమెంట్ చేయమని అమెజాన్‌ కోరినట్లు ఆయన వెల్లడించారు. అయితే,  మేనేజర్లు ‘నేను చేసిన పనిలో మార్పులు చేయడం, నా పేరుకు బదులు వారి పేరు ఎంట్రీ చేయడం, అసలు తాను చేసిన ప్రాజెక్ట్‌లో ఏమాత్రం సంబంధం లేని వారు కూడా.. ఆ ప్రాజెక్ట్‌లో తామే కీరోల్‌ పోషించామని చెప్పుకోవడం, ఆ పనికి నాకు సంబంధం లేదని తప్పుగా ప్రచారం చేశారని’ వాపోయారు  


 
సంస్థే గుర్తించలేదు
ఆ తర్వాత కొద్ది కాలానికి తొలగించిన ఉద్యోగులకు అమెజాన్‌ ఇతర సంస్థల్లో అవకాశాలు కల్పించింది. తిరిగి సంస్థలోకి తీసుకుంది. అందులో లేఆఫ్స్ గురైన ఈ మాజీ ఉద్యోగి కూడా ఉన్నాడు. ‘నా మేనేజర్ ఎప్పుడూ నీ మంచి కోరే వాడిని అని ఎప్పుడూ చెబుతుండే వారు. కానీ అది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇది నాకు చెంప దెబ్బలాంటిది’ అని పేర్కొన్నారు. చివరిగా.. అమెజాన్‌లో ఉద్యోగం కోల్పోయినా.. ఇతర సంస్థల్లో ఉన్నత ఉద్యోగం సంపాదించే టాలెంట్‌ నాలో ఉంది. సంస్థే అది గుర్తించలేదు. నాలుగు సార్లు కంపెనీలోకి తీసుకోవాలని ప్రయత్నించింది. కానీ నేనే అమెజాన్‌లో చేరలేదంటూ తన సోషల్‌ మీడియా పోస్ట్‌ని ముగించాడు. 

చదవండి👉 మెటాలో ఊడిన ఉద్యోగం.. ఆనందంలో తేలిపోయిన మేనేజర్‌

మరిన్ని వార్తలు