ఎఫ్‌డీసీ నుంచి 800ఎంజీ ఫావిపిరావిర్‌

30 Oct, 2020 09:14 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్: ఔషధ తయారీ సంస్థ ఎఫ్‌డీసీ లిమిటెడ్ భారతదేశంలో కోవిడ్-19 తేలికపాటి లక్షణాలకు వినియోగించే మందులను లాంచ్ చేసింది. తాజాగా 800 ఎంజీ ఫావిపిరావిర్‌ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. కరోనా‌ చికిత్సలో వాడే ఫావిపిరావిర్‌ను పిఫ్లు ఫావెంజా బ్రాండ్లలో కంపెనీ విక్రయిస్తోంది.ఇకపై వీటి 800 ఎంజీ వెర్షన్ మందులు మరింత శక్తివంతంగా పనిచేస్తాయని కంపెని చెబుతోంది. 800 ఎంజీ ట్యాబ్లెట్లతో రోగులకు చికిత్స వ్యయం 30 శాతం తగ్గుతుందని ఎఫ్‌డీసీ ప్రతినిధి మయంక్‌ టిక్కా తెలిపారు. అలాగే రోగి తీసుకోవలసిన మాత్రల సంఖ్యను 75శాతం తగ్గించడానికి సహాయపడుతుందన్నారు. మందుల షాపులతోపాటు ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఫార్మాసీల్లోనూ నవంబరు 1 నుంచి ఇవి లభిస్తాయి.

మరిన్ని వార్తలు