గరుడవేగ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ షిప్పింగ్ సర్వీసెస్

13 May, 2021 12:38 IST|Sakshi

హైదరాబాద్‌: కరోనా విపత్కర పరిస్థితుల్లో తనవంతు సాయం చేయటానికి గరుడవేగ సంస్థ ముందుకు వచ్చింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఎక్కడ కొనుగోలు చేసినా వాటిని ఇండియాలోని తమ వారికి వాటిని నేరుగా అందిచాలని అనుకుంటే, వెంటనే తమను సంప్రదించాలని (www.garudavega.com) గరుడవేగ సంస్థ ప్రకటించింది. 
 
ఏ విధమైన లాభాలు ఆశించకుండా, ఆ సిలెండర్లు పంపటానికి ఎంత ఖర్చు అవుతుందో, అంతే సొమ్ము తీసుకుని, మీవారికి ఆ సిలెండర్లు అందిస్తామని గరుడవేగ తెలిపింది. పేలెట్ కార్గో/కమర్షియల్ షిప్మెంట్లు చేయదలుచుకున్నవారు oxygen@garudavega.comకు ఈమెయిల్ చెయవచ్చు.


గరుడవేగ కొత్తగా రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా అమెరికా నుంచి ఎక్కడికైనా, లేదా అమెరికాలోని వివిధ ప్రాంతాలకు మీరు పంపదలుచుకున్నవి షిప్ చేయవచ్చు. ఇతర షిప్మెంట్ సంస్థలతో పోలిస్తే, మీకు 50 నుంచి 60 శాతం తక్కువ ధరకు తమ సేవలు అందుతాయని గరుడవేగ తెలిపింది.

డ్రాప్ ఆఫ్ సర్వీస్, ఫ్రీ పికప్ సర్వీసుతో పాటు మీరే లేబుల్ ప్రింట్ చేసుకునే సదుపాయం.. కార్పొరేట్ సంస్థలకు డిస్కౌంట్లు కూడా ఉన్నాయని వెల్లడించింది. ఇండియా నుంచి అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఎమిరేట్స్, మిడిల్ ఈస్ట్ తో బాటు, రెండువందల దేశాలకు  షిప్పింగ్ సేవలు అందిస్తున్నట్టు గరుడవేగ తెలిపింది. ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, ఒరిస్సా, చండీఘర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, కేరళ ఇలా ఇండియాలో 250 ప్రదేశాలలో తమ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు