హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిజిటల్‌ బాట

26 Apr, 2022 16:58 IST|Sakshi

న్యూఢిల్లీ: గతేడాది నిషేధం ఎత్తివేసిన తర్వాత నుంచి స్వల్పకాలంలోనే 21 లక్షల క్రెడిట్‌ కార్డులను జారీ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వచ్చే కొన్ని త్రైమాసికాల్లో పలు డిజిటల్‌ ఆవిష్కరణలు చేయనున్నట్టు బ్యాంకు సీఎఫ్‌వో ఆర్‌ శ్రీనివాసన్‌ వైద్యనాథన్‌ తెలిపారు. ఈ ఏడాది మార్చి చివరి నుంచి డిజిటల్‌ ఉత్పత్తుల ఆవిష్కరణపైనా ఆర్‌బీఐ ఆంక్షలు ఎత్తివేయడంతో బ్యాంకు తదుపరి వృద్ధి ప్రణాళికలపై దృష్టి పెట్టింది. ‘‘బలమైన, సురక్షితమైన టెక్నాలజీతో, మరింత విస్తరణకు వీలుగా ఏర్పాట్లు చేశాం. కొత్త సాంకేతికతను అదే పనిగా పర్యవేక్షిస్తున్నాం’’ అని ఫలితాల సమావేశం సందర్భంగా వైద్యనాథన్‌ తెలిపారు.

చదవండి: కీలక నిర్ణయం..వాటాలను విక్రయించేందుకు సిద్ధమైన హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్‌..!

మరిన్ని వార్తలు