Jio AirFiber: ఎయిర్‌ఫైబర్‌ కస్టమర్లకు జియో ఆఫర్లు..

2 Feb, 2024 16:46 IST|Sakshi

జియో ఎయిర్‌ ఫైబర్‌ (Jio AirFiber) కస్టమర్లకు అదనపు డేటా కోసం డేటా బూస్టర్ ప్లాన్‌లను అందిస్తోంది.  నెలవారీ అన్‌లిమిటెడ్‌ డేటా కోటా పూర్తయి అదనపు డేటా కావాల్సినవారి కోసం మూడు డేటా బూస్టర్ ప్లాన్‌లను జియో తీసుకొచ్చింది.

జియో కొన్ని నెలలుగా దేశంలోని పలు నగరాల్లో ఎయిర్‌ఫైబర్ సేవలను అందిస్తోంది. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని అందించడానికి 5G టెక్నాలజీని ఉపయోగించే వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్.  1 నుంచి 1.5 Gbps వేగంతో ఇంటర్నెట్ అందించగల దీన్ని నివాస, కార్యాలయ వినియోగం కోసం రూపొందించారు.

జియో ప్రకారం..  దాని ఎయిర్‌ ఫైబర్‌ వినియోగదారులు నెలకు 1TB హై-స్పీడ్ డేటాను ఆనందించవచ్చు. అయితే ఈ పరిమితిని చేరుకున్న తర్వాత, వేగం తగ్గుతుంది. వినియోగదారులకు మరిన్ని డేటా ఎంపికలను అందించడానికి మూడు రకాల డేటా బూస్టర్ ప్యాక్‌లను అందిస్తోంది. 

డేటా బూస్టర్ ప్లాన్ వివరాలు 
1TB కంటే ఎక్కువ హై-స్పీడ్ డేటా అవసరమయ్యేవారు  స్పీడ్ బూస్ట్ పొందడానికి ఈ ప్యాక్‌లను ఎంచుకోవచ్చు. 

  • రూ. 101 ప్లాన్: ఈ ప్లాన్ మీ బేస్ ప్లాన్‌తో సమానమైన వేగంతో 100GB అదనపు డేటాను అందిస్తుంది. 
  • రూ. 251 ప్లాన్: ఈ ప్లాన్‌తో మీరు మీ బేస్ ప్లాన్‌లో ఉన్న వేగంతో 500GB అదనపు డేటాను పొందుతారు. 
  • రూ. 401 ప్లాన్: ఇది మీ బేస్ ప్లాన్‌లో ఉన్నట్టుగానే అదే వేగంతో 1000GB డేటా టాప్ అప్ అందిస్తుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు